News December 2, 2024

తెలంగాణలో 1.58లక్షల మంది HIV బాధితులు

image

TG: రాష్ట్రంలో 1.58లక్షల మంది HIV బాధితులు ఉన్నారని కేంద్ర వైద్యఆరోగ్యశాఖ తెలిపింది. 1.58లక్షల మందిలో 1.54లక్షల మంది బాధితులు 15 ఏళ్లు పైబడిన వారే ఉన్నారంది. 2023లో రాష్ట్ర వ్యాప్తంగా ఎయిడ్స్‌తో బాధపడుతూ 2,820 మంది చనిపోయారని వెల్లడించింది. అదే ఏడాది అత్యధికంగా హెచ్‌ఐవీ సోకిన వారి సంఖ్యలో రంగారెడ్డి (421) జిల్లా టాప్‌లో ఉన్నట్లు ఆరోగ్యశాఖ నివేదిక వెల్లడించింది.

Similar News

News March 13, 2026

షేమ్ ఆన్ యూ కావ్యా మారన్.. SMలో ట్రోలింగ్

image

హండ్రెడ్ లీగ్‌ సన్‌రైజర్స్‌లోకి PAK బౌలర్ <<19368622>>అబ్రార్‌ను<<>> తీసుకోవడంతో ఓనర్ కావ్యా మారన్‌పై SMలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆమె పాక్ ప్లేయర్‌ను కొనడం టెర్రరిజాన్ని ప్రోత్సహించడమేనని మండిపడుతున్నారు. ‘Shame on you kavya maran’ హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. ఈ వివాదంపై BCCI వైస్ ఛైర్మన్ రాజీవ్ శుక్లా స్పందించారు. IPL మినహా ఇతర లీగుల్లో ఎవరిని తీసుకోవాలనేది ఫ్రాంచైజీల ఇష్టమన్నారు.

News March 13, 2026

జైశంకర్ స్కెచ్.. అగ్రరాజ్యానికి బ్రిక్స్ చెక్?

image

విదేశాంగ మంత్రి జైశంకర్ ఇరాన్‌ విదేశాంగ మంత్రి అరాఘ్చీతో మరోసారి ఫోన్‌లో మాట్లాడారు. ద్వైపాక్షిక అంశాలతో పాటు BRICS విషయాలు చర్చించినట్లు వెల్లడించారు. US/ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో జైశంకర్ వరుసగా ఇరాన్‌తో చర్చలు జరపడం హాట్‌టాపిక్‌గా మారింది. అయితే ఏకపక్ష నిర్ణయాలతో, ఆధిపత్య వైఖరిని ప్రదర్శిస్తున్న USకు చెక్ పెట్టడమే లక్ష్యంగా BRICSను బలోపేతం చేసే దిశగా సాగుతున్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు.

News March 13, 2026

మాజీ DGP HJ దొర కన్నుమూత

image

ఉమ్మడి ఏపీ డీజీపీ HJ దొర కన్నుమూశారు. కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన నిమ్స్‌లో చికిత్స పొందుతూ మరణించారు. 1943లో శ్రీకాకుళంలో జన్మించిన దొర.. విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ చేశారు. 1965 బ్యాచ్‌కు చెందిన IPS అధికారి. కేంద్రంలో విజిలెన్స్‌ అధికారిగా, CISFకి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌‌గా పనిచేశారు. పదవిలో ఉండగా.. ఆయన్ని చంపేస్తామని మావోయిస్టులు అప్పట్లో బెదిరించారు.