News December 2, 2024

SAD: పోస్టింగ్‌‌కి వెళ్తూ యువ IPS మృతి

image

ఎన్నో కలలు, ఎంతో కృషి, ఎన్నో త్యాగాల ఫలితం IPS. అయితే వచ్చిన ఆ ఫలితాన్ని కనీసం రుచి చూడకుండానే కన్నుమూశారో యంగ్ IPS. MPకి చెందిన హర్ష్ బర్దన్(26) ఇటీవల మైసూరులో ట్రైనింగ్ పూర్తి చేశారు. కర్ణాటక హసన్‌(D)లో పోస్టింగ్ తీసుకునేందుకు వెళ్తుండగా తాను ఉన్న పోలీస్ వాహనం టైర్ పేలింది. వాహనం చెట్టును ఢీకొట్టగా హర్ష్ బర్ధన్ తలకు బలమైన గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా ప్రాణాలు పోయాయి.

Similar News

News March 13, 2025

IPL: హ్యారీ బ్రూక్‌పై రెండేళ్ల నిషేధం

image

ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ హ్యారీ బ్రూక్‌పై బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆయన ఐపీఎల్‌లో రెండేళ్లు ఆడకుండా నిషేధం విధించింది. దీంతో బ్రూక్ ఐపీఎల్ ఆడే అవకాశం లేదు. 2028 ఐపీఎల్‌లో మాత్రమే ఆడే ఛాన్స్ ఉంది. కాగా ఇటీవల ఐపీఎల్ 2025 నుంచి తప్పుకుంటున్నట్లు బ్రూక్ ప్రకటించారు. దీంతో ఐపీఎల్ రూల్ ప్రకారం సరైన కారణం లేకుండా టోర్నీ నుంచి తప్పుకుంటే రెండేళ్ల నిషేధం విధిస్తారు.

News March 13, 2025

దస్తగిరికి భద్రత పెంపు

image

AP: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్యకేసులో అప్రూవర్ దస్తగిరికి ప్రభుత్వం భద్రత పెంచింది. గతంలో ఆయనకు 1+1 సెక్యూరిటీ ఉండగా ఇకపై 2+2కు గన్‌మెన్లను కేటాయించినట్లు ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. వివేకా హత్య కేసులో సాక్షులు అనుమానాస్పదంగా మృతి చెందుతున్న నేపథ్యంలో తనకు భద్రత కల్పించాలని ఆయన ఇటీవల విన్నవించారు. దీంతో సెక్యూరిటీ పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.

News March 13, 2025

రూపాయి గుర్తు ఎలా రూపొందించారంటే..

image

దివంగత ఆర్థిక మంత్రి ప్రణబ్ 2009 కేంద్ర బడ్జెట్ సమయంలో రూపాయికి గుర్తు సూచించాలని ఓపెన్ కాంపిటిషన్ ప్రకటించారు. 3331 డిజైన్లలో 5 షార్ట్ లిస్ట్ చేసి DMK మాజీ MLA కుమారుడు, ప్రొఫెసర్ ఉదయ్ పంపినది ఎంపిక చేశారు. ఇది దేవనాగరి లిపి र “ra”, లాటిన్ ఇంగ్లిష్‌లో నిలువు గీత లేని Rను పోలి ఉంటుంది. ₹లో 2 సమాన అడ్డగీతలు అసమానతల్లేని సంపద పంపిణీని సూచిస్తాయి.
PS: గతంలో Rs, Re, రూ. అని భిన్న రూపాయి సూచకాలుండేవి.

error: Content is protected !!