News December 2, 2024

చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ

image

AP: సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఉండవల్లిలోని సీఎం నివాసానికి పవన్ వచ్చారు. వీరి భేటీలో రాజ్యసభ సీట్ల సర్దుబాటు, బియ్యం అక్రమ రవాణా, అదానీ విద్యుత్ ఒప్పందాలు, తాజా రాజకీయ పరిస్థితులు చర్చకు వచ్చే అవకాశం ఉంది.

Similar News

News March 28, 2026

IPL 2026: కోహ్లీ ముందున్న 5 అరుదైన రికార్డులు

image

IPLలో కోహ్లీ పలు రికార్డులపై కన్నేశారు. 339 రన్స్ సాధిస్తే 9,000 IPL పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాటర్‌గా నిలుస్తారు. అలాగే ఒకే జట్టు (RCB) తరపున 10,000 T20 రన్స్, 300 సిక్సర్లు బాదిన ఫస్ట్ ప్లేయర్‌గా చరిత్ర సృష్టించే అవకాశం ఉంది. భారత్‌లో 10,000 T20 రన్స్ మైల్‌స్టోన్‌కు కేవలం 296 పరుగుల దూరంలో ఉన్నారు. ఒకే వేదికపై (చిన్నస్వామి స్టేడియం) హయ్యెస్ట్ రన్స్ రికార్డును మరింత మెరుగుపరుచుకోనున్నారు.

News March 28, 2026

ట్రంప్-మోదీ ఫోన్ కాల్‌లో ఎలాన్ మస్క్

image

యుద్ధం నేపథ్యంలో ఇటీవల ట్రంప్, మోదీ ఫోన్‌లో మాట్లాడుకున్నారు. ఈ కాల్‌లో మస్క్ పాల్గొనడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం.. ఇద్దరు దేశాధినేతల మధ్య జరిగే దౌత్యచర్చల్లో ఏ ప్రభుత్వ పదవిలో లేని ఒక ప్రైవేట్ వ్యక్తి పాల్గొనడం చాలా రేర్. ముఖ్యంగా గ్లోబల్ ఎనర్జీకి కీలకమైన ‘స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్’ కంట్రోల్ గురించి చర్చిస్తున్న సమయంలో మస్క్ ఉండటం చర్చనీయాంశమైంది.

News March 28, 2026

ఇరాన్ అణు కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడి

image

ఇజ్రాయెల్ తాజా ఎయిర్ స్ట్రైక్స్‌లో ఇరాన్‌లోని అరాక్ హెవీ వాటర్ రియాక్టర్, అర్దకాన్ యురేనియం ప్లాంట్‌లను టార్గెట్ చేసింది. అణ్వాయుధాల తయారీకి అవసరమైన కీలక ఇన్‌ఫ్రాను ధ్వంసం చేయడమే లక్ష్యమని IDF వెల్లడించింది. ఈ అటాక్స్‌లో ఎటువంటి ప్రాణనష్టం, రేడియేషన్ ముప్పు లేదని ఇరాన్ స్పష్టం చేసింది. అయితే కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించింది.