News December 2, 2024
పదవులపై ఆశ లేదు: శిండే కుమారుడు

తాను డిప్యూటీ సీఎం అవుతాననే ప్రచారంపై మహారాష్ట్ర ఆపద్ధర్మ సీఎం ఏక్నాథ్ శిండే కుమారుడు శ్రీకాంత్ శిండే స్పందించారు. ఆ రేసులో లేనని, తనకు పదవులపై ఎలాంటి ఆశ లేదని స్పష్టం చేశారు. ‘లోక్‌సభ ఎన్నికల తర్వాత నాకు కేంద్రమంత్రి పదవి ఆఫర్ వచ్చినా తీసుకోలేదు. పార్టీ కోసం పనిచేయడానికే కట్టుబడి ఉన్నా’ అని శ్రీకాంత్ వెల్లడించారు.
Similar News
News January 13, 2026
పవన్ కళ్యాణ్‌కు మోదీ అభినందన

AP: జపనీస్ <<18828407>>కత్తిసాము<<>> కళ కెంజుట్సులో అధికారిక ప్రవేశం పొందిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను PM మోదీ ప్రశంసించారు. ‘ఇటు ప్రజా జీవితంలో, అటు సినిమా కెరీర్లో బిజీగా ఉంటూనే మార్షల్ ఆర్ట్స్ అభ్యసించడం ప్రశంసనీయం. యుద్ధ కళలు అభ్యసించడానికి శారీరక బలంతోపాటు మానసిక సమతుల్యత, సహనం, స్వీయ నియంత్రణ అవసరం. ఫిట్ ఇండియాకు ప్రజాజీవితంలో ఉన్న మీలాంటి వ్యక్తులు స్ఫూర్తినివ్వాల్సిన అవసరం ఉంది’ అని పేర్కొన్నారు.
News January 13, 2026
తల్లిదండ్రుల అవినీతి డబ్బును పిల్లలు తిరస్కరించాలి: SC

తల్లిదండ్రులు సంపాదించిన అవినీతి డబ్బును పిల్లలు తిరస్కరించాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ BV నాగరత్న కోరారు. ‘తమ తల్లిదండ్రులు ఆదాయానికి మించి సంపాదించిన దేన్నైనా పిల్లలు తీసుకోకూడదు. వాటికి లబ్ధిదారులుగా ఉండొద్దు. ఇది దేశానికి చేసిన గొప్ప సేవ అవుతుంది’ అని పేర్కొన్నారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏకు చట్టబద్ధతపై దాఖలైన పిల్ విచారణ సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
News January 13, 2026
తుర్కియే, పాకిస్థాన్, సౌదీ.. ‘ఇస్లామిక్ నాటో’ కూటమి?

పాకిస్థాన్, సౌదీ అరేబియాతో కలిసి ‘ఇస్లామిక్ నాటో’ అనే రక్షణ కూటమి ఏర్పాటు చేసేందుకు తుర్కియే ప్లాన్ చేస్తున్నట్లు ‘బ్లూమ్‌బర్గ్’ నివేదిక వెల్లడించింది. ఆపరేషన్ సిందూర్ సమయంలో తుర్కియే 350 డ్రోన్లు ఇచ్చి పాక్‌కు సపోర్ట్ చేసింది. మరోవైపు గతేడాది పాకిస్థాన్-సౌదీ అరేబియా మధ్య కీలక రక్షణ ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్‌కు డిఫెన్స్ పరంగా తలనొప్పేనని విశ్లేషకులు చెబుతున్నారు.


