News December 2, 2024
పార్లమెంటులో రాజ్యాంగంపై త్వరలో ప్రత్యేక చర్చ

పార్లమెంటు ఉభయ సభల్లో రాజ్యాంగంపై ప్రత్యేక చర్చ జరగనుంది. లోక్‌సభలో డిసెంబర్ 13, 14 తేదీల్లో, రాజ్యసభలో 16, 17 తేదీల్లో ఈ చర్చలు జరుగుతాయి. ఇటీవల దేశంలో చోటుచేసుకుంటున్న పరిణామాలను దృష్టిలో ఉంచుకొని, రాజ్యాంగ విలువల ప్రాముఖ్యతను పున:సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని విపక్ష పార్టీలు వాదిస్తున్నాయి. దీంతో లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ ఛైర్మన్ ఈ మేరకు అంగీకరించినట్టు తెలుస్తోంది.
Similar News
News April 18, 2026
మారని కోల్‘కథ’.. ఇక ఇంటికేనా?

IPL 2026లో KKR పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. 6 మ్యాచుల్లో 5 ఓడగా, వర్షం వల్ల ఒకటి రద్దయింది. ఇంకా 8 మ్యాచులు మిగిలి ఉండటంతో కనీసం 7 గెలిస్తే ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతం టీమ్ ఆట తీరు చూస్తే అది అనుమానమే. ఒక్క మ్యాచ్ అయినా గెలుస్తుందా అనేలా తయారైంది పరిస్థితి. అసాధారణ రీతిలో పుంజుకుంటే తప్ప ప్లే ఆఫ్స్ రేసులో నిలవడం దాదాపు అసాధ్యం. మీరేమంటారు?
News April 18, 2026
గాడిదలా నటించమని అడిగినా సరే..: ఆర్య

దర్శకులు బాల, పా.రంజిత్‌ను తాను ఎంతో నమ్ముతానని తమిళ హీరో ఆర్య చెప్పారు. వాళ్లతో సినిమాలకు స్క్రిప్ట్ పూర్తిగా వినాల్సిన అవసరం కూడా ఉండదని అన్నారు. ‘నాకు కథ చెప్పకుండానే వెట్టువమ్ మూవీని రంజిత్ తీస్తున్నారు. బాల సర్ నన్ను గాడిదగా చేయమన్నా సరే చేసేస్తా. నెల రోజుల్లో అఘోరీ లుక్(నేనే దేవుడ్ని) కోసం సిద్ధమవ్వాలని చెప్పి నన్ను హీరోగా సెలక్ట్ చేశారు’ అని ‘మిస్టర్ ఎక్స్’ ప్రమోషన్స్‌లో ఆయన చెప్పారు.
News April 18, 2026
డీ‘లిటిగేషన్’.. గెలిచిందెవరు?

131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో <<19674859>>వీగిపోవడం<<>> తమ విజయమని ప్రతిపక్షాలు అంటున్నాయి. డీలిమిటేషన్ అంశాన్ని ముడిపెట్టడంతోనే మహిళా బిల్లు గట్టెక్కలేదని, ఇది ప్రజాస్వామ్య గెలుపు అని చెబుతున్నాయి. BJP మాత్రం మహిళా కోటాకు ప్రతిపక్షాలు వ్యతిరేకమని ప్రజల్లోకి వెళ్తోంది. ఈ ప్రభావం బెంగాల్, TN ఎన్నికల్లో ఉంటుందని భావిస్తోంది. అందుకే సంఖ్యా బలం లేకున్నా బిల్లు పెట్టిందనే చర్చ సాగుతోంది. దీనిపై మీ కామెంట్.


