News December 2, 2024

మావోల ఎన్‌కౌంటర్‌.. మృతదేహాలను భద్రపరచాలని కోర్టు ఆదేశం

image

TG: ఏటూరు నాగారం ఎన్‌కౌంటర్‌లో హతమైన మావోయిస్టుల మృతదేహాలను రేపటి వరకు భద్రపరచాలని, మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు చూపించాలని హైకోర్టు ఆదేశించింది. ఇది బూటకపు ఎన్‌కౌంటర్ అని దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపింది. భోజనంలో మత్తు కలిపి, చిత్రహింసలకు గురిచేసి మావోలను చంపారని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. మృతదేహాలపై గాయాలున్నాయన్నారు. వాదనల అనంతరం విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది.

Similar News

News November 6, 2025

చేతులు మెరిసేలా..

image

కొందరిలో ముఖం ప్రకాశవంతంగానే ఉన్నా.. చేతులు మాత్రం జీవం కోల్పోయినట్లుగా తయారవుతాయి. దీనికోసం ఉప్పుతో తయారుచేసిన స్క్రబ్‌ని ఉపయోగిస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. కొద్దిగా ఉప్పులో లావెండర్ నూనె కలిపి దాన్ని చేతులకు రాసుకోవాలి. పదినిమిషాల తర్వాత మృదువుగా రుద్దుతూ క్లీన్ చేసుకోవాలి. ఈ చిట్కాను వారానికి రెండుసార్లు పాటిస్తే చేతులపై చేరిన మృతకణాలు, మురికి తొలగిపోయి మృదువుగా మారతాయి.

News November 6, 2025

తెలంగాణ న్యూస్ అప్‌డేట్స్ @2PM

image

*రేపు జరగాల్సిన క్యాబినెట్ మీటింగ్ ఈ నెల 12కు వాయిదా
*హైదరాబాద్ బోరబండలో బండి సంజయ్ కార్నర్ మీటింగ్‌కు అనుమతి రద్దు చేశారంటూ బీజేపీ నేతల ఆందోళన.. సభ జరిపి తీరుతామని స్పష్టం
*జూబ్లీహిల్స్‌లో 3 పార్టీల మధ్య గట్టి పోటీ ఉందన్న కిషన్ రెడ్డి
*ఫిరాయింపు MLAలు తెల్లం వెంకట్రావు, సంజయ్‌లను నేడు విచారించనున్న స్పీకర్ గడ్డం ప్రసాద్

News November 6, 2025

సమగ్ర వ్యవసాయ విధానాలు (మోడల్స్)

image

☛ పంటలు + పశువులు +జీవాల పెంపకం.
☛ పంటలు + పశువులు + చేపల పెంపకం.
☛ పంటలు + కోళ్లు + చేపల పెంపకం
☛ పంటలు + పశువులు + కోళ్లు + చేపల పెంపకం.
☛ పంటలు + కోళ్లు + చేపలు + పుట్టగొడుగుల పెంపకం
☛ పంటలు + పశువులు + వర్మీ కంపోస్ట్ + చేపల పెంపకం
☛ పశువులు+ జీవాలు + కోళ్ల పెంపకం.. వాతావరణం, రైతు స్థితి, సహజ వనరులను బట్టి <<18185953>>సమగ్ర వ్యవసాయ<<>> అనుబంధ రంగాలను ఎంచుకోవచ్చు.