News December 2, 2024

సిరియాలో అంతర్యుద్ధానికి కారణాలు ఇవే

image

సిరియా అధ్యక్షుడు బషర్ అల్-అసద్ నియంత వైఖరి, కుటుంబ పాల‌న‌, అణ‌చివేత‌తో ప్రజల్లో అసంతృప్తి రేగింది. 2011లో బ‌ష‌ర్‌కు వ్య‌తిరేకంగా రెబల్స్ ఏకమ‌వ్వ‌డంతో అంత‌ర్యుద్ధం ప్రారంభ‌మైంది. దానికి ముందు అర‌బ్ దేశాల్లో జరిగిన ప్ర‌జాస్వామ్య పోరాటాలు(Arab Spring) స్ఫూర్తి నివ్వ‌డంతో సిరియాలో అంత‌ర్యుద్ధం మొద‌లైంది. అమెరికా, రష్యా, ఇరాన్, టర్కీ దేశాల ప్రయోజనాలు, ఉగ్ర సంస్థల భాగస్వామ్యం సంక్షోభాన్ని పెంచాయి.

Similar News

News March 4, 2026

24,800 మంది బోగస్ ఉద్యోగులు… జీతం కింద ప్రైవేటు ఏజెన్సీలకు రూ.కోట్లు

image

TG: GOVTలో దాదాపు 3.70L మంది అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు సిబ్బంది పనిచేస్తున్నారని, వారిలో 24,800 మంది బోగస్ ఉద్యోగులేనని మాజీ CS శాంతి కుమారి కమిటీ తేల్చింది. ఇంకా 14 శాఖల వివరాలు వస్తే ఈ సంఖ్య మరింత పెరగనుంది. బ్యాంకుఖాతా, పాన్, ఆధార్ లేకుండానే 10 ఏళ్లకు పైగా జీతం కింద ప్రైవేటు ఏజెన్సీలకు రూ.కోట్లు ఇస్తున్నారు. ఈ రిపోర్టు CMకు అందగా, వారి జీతాల చెల్లింపును నిలిపేయాలని ఆయన ఆదేశించారు.

News March 4, 2026

T20 WC ఎఫెక్ట్.. బాబర్‌పై పాక్ వేటు!

image

T20 WCలో విఫలమైన పాక్ స్టార్ క్రికెటర్ బాబర్ ఆజమ్‌పై PCB వేటువేసింది. బంగ్లాదేశ్‌తో జరిగే ODI సిరీస్‌ నుంచి అతడిని పక్కన పెట్టింది. షాహీన్ అఫ్రీది కెప్టెన్‌గా 15 మందితో స్క్వాడ్‌ను తాజాగా ప్రకటించింది. ఇందులో ఆరుగురు కొత్త ప్లేయర్లను తీసుకోవడం గమనార్హం. ఈ నెల 11 నుంచి పాక్-బంగ్లా మధ్య 3 వన్డేలు జరగనున్నాయి. T20 WCలో 4 ఇన్నింగ్స్‌లలో బాబర్ 91 పరుగులే చేశారు. అత్యధికంగా UAEపై 46 రన్స్ కొట్టారు.

News March 4, 2026

NATO దేశమైన తుర్కియేపైకి ఇరాన్ మిస్సైల్

image

మిడిల్ ఈస్ట్‌లో యుద్ధం మరిన్ని దేశాలకు పాకే అవకాశం ఉంది. NATO సభ్య దేశమైన తుర్కియేపైకి ఇరాన్ బాలిస్టిక్ క్షిపణిని ఫైర్ చేసింది. ఇరాక్, సిరియా దేశాలపై నుంచి ఈ మిస్సైల్ దూసుకొచ్చిందని, దాన్ని NATO ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ విజయవంతంగా అడ్డుకుందని తుర్కియే మంత్రి వెల్లడించారు. సిరియా సరిహద్దుల్లో శకలాలు పడ్డాయన్నారు. కాగా NATO దేశంపై దాడి జరిగితే మిగతా సభ్య దేశాలూ రంగంలోకి దిగాలనే నిబంధన ఉంది.