News December 2, 2024

నోటిఫికేషన్ విడుదల

image

AP: సివిల్ అసిస్టెంట్ సర్జన్ల ఖాళీల భర్తీకి ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ పరిధిలో
మొత్తం 280 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీ చేయనున్నారు. పీహెచ్‌సీలు/ఇతర వైద్య సంస్థల్లో రెగ్యులర్ ప్రాతిపదికన నియామకం చేయనున్నారు. ఆన్‌లైన్‌లో డిసెంబర్ 4 నుంచి DEC 13 వరకు అప్లై చేసుకోవచ్చు. సైట్: http:apmsrb.ap.gov.in/msrb/

Similar News

News March 18, 2026

BREAKING: స్వల్పంగా తగ్గిన బంగారం ధర

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం, వెండి ధరలు కాస్త తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.330 తగ్గి రూ.1,57,750కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.300 పతనమై రూ.1,44,600గా ఉంది. అటు కేజీ వెండి ధర రూ.5వేలు తగ్గి రూ.2,75,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News March 18, 2026

గ్యాస్ కొరత: ఇన్‌స్టంట్ ఫుడ్ సేల్స్‌లో 20% జంప్

image

వంట గ్యాస్ కొరత తీవ్రం కావడంతో ప్రజలు ప్రత్యామ్నాయాల వైపు మొగ్గు చూపుతున్నారు. సిలిండర్ బుక్ చేసినా డెలివరీ ఆలస్యం అవుతుండటంతో ఇన్‌స్టంట్ నూడుల్స్, ఉప్మా మిక్స్, రెడీమేడ్ పులిహోర వంటి వాటిపై ఆధారపడుతున్నారు. దీంతో రెడీ-టు-ఈట్ ఫుడ్స్, ఫ్రోజెన్ స్నాక్స్ సేల్స్ 20% పెరిగాయి. సూపర్ మార్కెట్లలో కొన్ని రోజులుగా ఇన్‌స్టంట్ ఫుడ్ సెక్షన్లలో స్టాక్ వేగంగా ఖాళీ అవుతోందని వ్యాపారులు చెబుతున్నారు.

News March 18, 2026

గ్రాము బంగారం ₹లక్ష.. రాబర్ట్ కియోసాకి అంచనా

image

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో త్వరలో భారీ కుదుపు తప్పదని ‘రిచ్ డాడ్.. పూర్ డాడ్’ రచయిత రాబర్ట్ కియోసాకి అంచనా వేశారు. అది జరిగిన ఏడాది వ్యవధిలో బంగారం, వెండి ధరలు ఊహించని రీతిలో పెరుగుతాయన్నారు. గ్రాము గోల్డ్ ధర దాదాపు ₹లక్ష, గ్రాము వెండి ధర ₹540కి చేరే అవకాశం ఉందన్నారు. బిట్‌కాయిన్ $7,50,000, ఎథీరియం $95,000కు చేరతాయని తెలిపారు. తెలివైన ఇన్వెస్టర్లు దీన్నుంచి భారీగా సంపాదించుకుంటారని పేర్కొన్నారు.