News December 2, 2024
ప్రకృతిని రక్షిస్తే తిరిగి మనల్ని రక్షిస్తుంది: రేవంత్

HYDలోని అమీన్‌పూర్ చెరువును పునరుద్ధరించడంతో అరుదైన పక్షి తిరిగి కనిపించిందన్న కథనంపై CM రేవంత్ స్పందించారు. మనం ప్రకృతిని రక్షిస్తే అది తిరిగి మనల్ని రక్షిస్తుందని నమ్ముతానని పేర్కొన్నారు. కొన్నేళ్లుగా జరుగుతున్న నీటి వనరులు, పర్యావరణ సంపద విధ్వంసాన్ని తాము ఆపినట్లు చెప్పారు. దీంతో ప్రకృతి వెంటనే బహుమతిని ఇచ్చిందన్నారు. ఇది దేవుడి ఆమోదమేనని పేర్కొన్నారు. ఈ పక్షి శీతాకాలంలో ఆసియాకు వలస వస్తుంది.
Similar News
News March 20, 2026
సీక్వెల్స్‌లో మీకు నచ్చిన సినిమా ఏంటి?

సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం సీక్వెల్స్ హవా నడుస్తోంది. సూపర్ హిట్ అయిన చిత్రాలకు కొనసాగింపుగా సినిమాలు తీయడం పెరుగుతోంది. ఈ జాబితాలో బాహుబలి, KGF, పుష్ప, కాంతార(ప్రీక్వెల్), డీజే టిల్లు, అఖండ, కార్తికేయ, ఇస్మార్ట్ శంకర్, దృశ్యం, F2, పొన్నియన్ సెల్వన్, హిట్, పొలిమేర, మత్తు వదలరా, మ్యాడ్, తాజాగా ధురంధర్ సినిమాలు ఉన్నాయి. వీటిలో మీకు నచ్చిన సీక్వెల్ ఏంటో కామెంట్ చేయండి.
News March 20, 2026
ఇండస్ట్రియల్ డీజిల్ ధర రూ.22 పెంపు

గల్ఫ్ యుద్ధ ప్రభావంతో దేశంలో ఇండస్ట్రియల్ డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. లీటర్‌పై రూ.22 పెంచుతున్నట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) ప్రకటించింది. దీంతో ప్రస్తుతం రూ.87.57 ఉన్న ధర రూ.109.59కి చేరింది. ఈ డీజిల్‌ను పరిశ్రమలు, రవాణా, పవర్ జనరేషన్‌లో ఉపయోగిస్తారు. ఫలితంగా ప్రొడక్షన్ కాస్ట్, రవాణా ఛార్జీలు పెరగనున్నాయి. దీంతో వస్తువుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది.
News March 20, 2026
స్టాక్ మార్కెట్లకు జోష్.. రూపాయి డౌన్

నిన్నటి భారీ నష్టాల నుంచి ఈరోజు స్టాక్ మార్కెట్లు కోలుకొని లాభాలతో ట్రేడింగ్ ముగించాయి. సెన్సెక్స్ 325 పాయింట్ల లాభంతో 74,532 వద్ద, నిఫ్టీ 112 పాయింట్లు ఎగిసి 23,114 వద్ద సెటిల్ అయ్యాయి. క్రూడ్ టెన్షన్స్ తగ్గడం, కొనుగోళ్లు పెరగడం వంటివి మార్కెట్లలో జోష్ నింపాయి. రూపాయి మాత్రం ఒక డాలరుకు ₹93 మార్క్ దాటి జీవితకాల కనిష్ఠాన్ని నమోదు చేసింది. FII విక్రయాలు, డాలర్ డామినేషన్, యుద్ధం ఇందుకు కారణాలు.


