News December 2, 2024

చిత్తూరు: 120 స్మార్ట్ అలారం లాక్ పంపిణీ

image

టూ టౌన్ పోలీస్ స్టేషన్లో సీఐ నెట్టికంటయ్య నగరంలోని పలు ప్రార్ధనా మందిరాలకు 120 స్మార్ట్ అలారం లాక్ లను పంపిణీ చేశారు. జిల్లా ఎస్పీ ఆదేశానుసారం నియంత్రణకు టూ టౌన్ పరిధిలోని అన్ని చర్చిలు, దేవాలయాలు, మసీదులకు స్మార్ట్ అలారం లాక్ లను పంపిణీ చేస్తున్నామన్నారు. దుకాణా దారులు, ఇంటి యజమానులు సైతం ఈ లాక్ లను తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Similar News

News March 22, 2026

చిత్తూరు జిల్లా ప్రజలకు గమనిక

image

చిత్తూరు కలెక్టరేట్‌లో సోమవారం గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని యథావిధిగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదివారం తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తామని పేర్కొన్నారు. సమస్యలపై meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లో కూడా ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. అదేవిధంగా డయల్ 1100 కు కాల్ చేసి తమ సమస్యలను నమోదు చేసుకోవచ్చని తెలిపారు.

News March 22, 2026

పూతలపట్టు: ప్రమాదంలో మృతి చెందింది వీరే

image

పూతలపట్టు మండలం పి.కొత్తకోట సమీపంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన విషయం తెలిసిందే. తిరుమల దర్శనానికి వెళ్తున్న కర్ణాటక రాష్ట్రం మండ్యకు చెందిన కుటుంబం ప్రయాణిస్తున్న కారు లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సతీష్ (50), భాగ్యలక్ష్మి (45) అక్కడికక్కడే మృతి చెందగా, శశాంక్ (23), పవని (10), మహాలక్ష్మి (12), తుషార (4)లకు గాయాలు అయ్యాయి.

News March 22, 2026

చిత్తూరు జిల్లాలో చికెన్ ధరలు

image

చిత్తూరు జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. పలు దుకాణాల్లో బ్రాయిలర్ కోడి కిలో రూ.190, మాంసం 300 వరకు పలుకుతోంది. స్కిన్ లెస్ రూ.310 నుంచి రూ.320 వరకు విక్రయిస్తున్నారు. మరోవైపు12 కోడిగుడ్ల ధర రూ. 66 ఉంది. మీ ఏరియాలో మాంసం ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.