News December 2, 2024
మచిలీపట్నం: కలెక్టర్‌ని కలిసిన డీసీహెచ్ఎస్

కృష్ణా జిల్లా ప్రభుత్వ ఆస్పత్రుల కో-ఆర్డినేటర్ (DCHS)గా బాధ్యతలు స్వీకరించిన డా. జయకుమార్ సోమవారం కలెక్టర్ డీకే బాలాజీని మర్యాదపూర్వకంగా కలిశారు. అవనిగడ్డ ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్న జయకుమార్ ఇటీవల జరిగిన బదిలీల్లో భాగంగా కృష్ణాజిల్లా డీసీహెచ్ఎస్‌గా బదిలీపై వచ్చారు. ఈయన గతంలో మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్‌గా కూడా విధులు నిర్వర్తించారు.
Similar News
News March 16, 2026
కృష్ణా: ‘పది’ పరీక్షలకు సర్వం సిద్ధం.. జిల్లాలో 148 కేంద్రాలు

నేటి నుంచి ప్రారంభం కానున్న పదవ తరగతి పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లాలో మొత్తం 148 కేంద్రాల్లో పరీక్షలు జరగనుండగా 22,232 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. 148 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 148 మంది డిపార్ట్మెంట్ ఆఫీసర్లతో పాటు 1500 మంది ఇన్విజిలేటర్లు విధులు నిర్వర్తించనున్నారు. మాస్ కాపీయింగ్‌ను అరికట్టేందుకు 5 ఫ్లయింగ్ స్క్వాడ్‌లను ఏర్పాటు చేశారు.
News March 16, 2026
19న కృష్ణా జిల్లా అండర్-19 క్రికెట్ జట్ల ఎంపిక

కృష్ణా డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అండర్-19 బాలుర జిల్లా క్రికెట్ జట్ల ఎంపికలను నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి రవీంద్ర తెలిపారు. ఈ ఎంపికలు విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈనెల 19న ఉదయం నిర్వహిస్తామన్నారు. ఈ ఎంపికలకు జిల్లాలో ఆసక్తి ఉన్నవారు ఆధార్ కార్డ్ జిరాక్స్, జనన ధృవీకరణ పత్రం, వ్యక్తిగత కిట్ బ్యాగ్‌తో హాజరు కావాలన్నారు.