News December 2, 2024
‘హరిహర వీరమల్లు’ షూటింగ్.. పవన్ సెల్ఫీ

పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ సినిమా షూటింగ్‌లో పాల్గొన్నారు. ఈ విషయాన్ని ఆయన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ప్రకటించారు. వీరమల్లు గెటప్‌లో తీసుకున్న సెల్ఫీని పోస్ట్ చేశారు. ‘బిజీ పొలిటికల్ షెడ్యూల్ తర్వాత చివరకు నేను చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పని కోసం నా సమయాన్ని కొన్ని గంటలు ఇవ్వగలుగుతున్నా’ అని పేర్కొన్నారు.
Similar News
News November 10, 2025
సాహితీ శిఖరం నేలకొరిగింది: సీఎం రేవంత్

TG: అందెశ్రీ మరణంపై CM రేవంత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సాహితీ శిఖరం నేలకొరిగిందన్నారు. రాష్ట్ర సాధనలో అందెశ్రీ కోట్లాది ప్రజల గొంతుకై నిలిచారని కొనియాడారు. ఆయన రాసిన జయజయహే తెలంగాణను ప్రజా ప్రభుత్వం రాష్ట్ర గీతంగా ప్రకటించిందని గుర్తు చేసుకున్నారు. TPCC చీఫ్ మహేశ్ కుమార్, రాష్ట్ర మంత్రులు కూడా అందెశ్రీ మరణానికి సంతాపం తెలిపారు.
News November 10, 2025
ఐఆర్ 30 శాతం ప్రకటించాలి: PRTU

AP: హైస్కూల్ ప్లస్‌లలో లెక్చరర్లుగా అర్హత కలిగిన స్కూల్ అసిస్టెంట్లను నియమించాలని పీఆర్టీయూ డిమాండ్ చేసింది. పీఆర్సీ కమిటీని వెంటనే ఏర్పాటుచేయాలని, మధ్యంతర భృతి(IR) 30 శాతం ప్రకటించాలని కోరింది. అలాగే మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లలో హెడ్ మాస్టర్లకు ప్రత్యేక జాబ్ చార్ట్ ప్రకటించాలని APMPS HMల ఫోరం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. సర్వీసులో ఉన్న టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరింది.
News November 10, 2025
ప్రభుత్వ డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలు.. నేరుగా లైసెన్స్!

AP: రాష్ట్రానికి 53 డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలు(DTC), 5 ప్రాంతీయ ట్రైనింగ్ సెంటర్ల(RDTC)ను కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంజూరు చేసింది. 10 లక్షల జనాభాకు ఒకటి చొప్పున DTCలను పెట్టనుండగా RDTCలను ఉత్తరాంధ్ర, రాయలసీమలో ఒకటి చొప్పున, కోస్తాలో 3 ఏర్పాటు చేయనుంది. వీటిలో టూవీలర్, కార్లు, భారీ వాహనాల ట్రైనింగ్ పూర్తి చేసుకుంటే రవాణా శాఖ కార్యాలయంలో టెస్ట్ లేకుండా నేరుగా లైసెన్స్ పొందవచ్చు.


