News December 2, 2024

మద్యం కొనుగోళ్లు ఆపేస్తాం: వైన్స్ ఓనర్స్

image

AP: మద్యం షాపుల టెండర్‌కు ముందు ప్రకటించిన 20% కమీషన్ ఇవ్వాలని వైన్స్, బార్ల యజమానులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇవాళ కడపలో సమావేశమైన మద్యం షాపుల ఓనర్లు ఈనెల 5న ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్‌కు నోటీస్ ఇవ్వాలని నిర్ణయించారు. ఈనెల 14వ తేదీలోపు కమీషన్ పెంపుపై నిర్ణయం తీసుకోకపోతే మద్యం కొనుగోళ్లు ఆపేస్తామని హెచ్చరించారు. ప్రస్తుతం 9.5% కమీషన్ ఇస్తున్నారని, దీనితో లైసెన్స్ ఫీజులు కట్టలేమని చెబుతున్నారు.

Similar News

News January 17, 2026

పశువుల్లో సంక్రమిత వ్యాధులు అంటే ఏమిటి?

image

పాడి పశువులకు సోకే వ్యాధుల్లో చాలావరకు బాక్టీరియా, వైరస్‌, ఫంగస్‌, పరాన్నజీవుల వల్లే వస్తాయి. వ్యాధి సోకిన పశువుల మలమూత్రాలు, స్రావాలు, శ్వాస ద్వారా వ్యాధికారక సూక్ష్మజీవులు బయటకు విడుదలవుతాయి. ఇవి ఇతర పశువులకు ఆహారం, నీరు, గాలి, గాయాల ద్వారా వ్యాపిస్తాయి. వ్యాధి సోకిన పశువుల పాలను సరిగా మరిగించకుండా, మాంసాన్ని బాగా ఉడికించకుండా తింటే మనుషులకూ వ్యాపిస్తాయి. వీటినే ‘సంక్రమిత వ్యాధులు’ అంటారు.

News January 17, 2026

సార్.. జాబ్ క్యాలెండర్ ప్లీజ్: నిరుద్యోగులు

image

AP: ఇచ్చిన మాట ప్రకారం ఈ నెలలో జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని నిరుద్యోగులు కోరుతున్నారు. జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని మంత్రి లోకేశ్ గతంలో <<18617902>>ప్రకటించిన<<>> విషయాన్ని గుర్తుచేస్తున్నారు. 25వేల ఉద్యోగాలతో నోటిఫికేషన్ రిలీజ్ చేయాలంటూ Xలో పోస్టులు పెడుతున్నారు. ఉద్యోగాల కోసం లక్షల మంది నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారని, నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని అంటున్నారు.

News January 17, 2026

ఏపీ నుంచి వచ్చే వాహనాల దారి మళ్లింపు

image

సంక్రాంతి సెలవులు ముగియడంతో AP నుంచి HYDకు వాహనాల రద్దీ పెరిగింది. NH-65 విస్తరణ పనుల దృష్ట్యా అధికారులు వాహనాలను దారి మళ్లిస్తున్నారు. గుంటూరు నుంచి HYD వచ్చే వెహికల్స్‌ను మిర్యాలగూడ-హాలియా-చింతపల్లి-మాల్, మాచర్ల-సాగర్-పెద్దవూర-చింతపల్లి-మాల్ మీదుగా, విజయవాడ నుంచి వచ్చే వాటిని కోదాడ-మాల్ నుంచి HYDకు పంపిస్తున్నారు. NH-65పై ట్రాఫిక్ జామ్ ఏర్పడితే చిట్యాల నుంచి భువనగిరి మీదుగా దారి మళ్లించనున్నారు.