News December 3, 2024

ఎంపీ వద్దిరాజు ఉప రాష్ట్రపతితో సమావేశం

image

భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర ఉప రాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధనఖర్ తో సమావేశమయ్యారు. పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్న సందర్భంగా రాజ్యసభలోని ఛైర్మన్ ఛాంబర్ కు ఎంపీ రవిచంద్ర సోమవారం ఉదయం వెళ్లి ధనఖర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతితో రాజ్యసభ సభ్యుడు పలు అంశాలపై చర్చించారు.

Similar News

News November 11, 2025

విద్యతోనే పేదరికం నిర్మూలన: కలెక్టర్ అనుదీప్

image

విద్య ద్వారానే పేదరికం నుంచి శాశ్వత విముక్తి సాధ్యమని ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జాతీయ విద్యా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన, మౌలానా అబుల్ కలాం ఆజాద్ సేవలను స్మరించారు. ఆయన విద్యాశాఖ మంత్రిగా పనిచేసి ప్రతి వర్గానికి విద్య అందేలా కృషి చేశారని తెలిపారు. మైనారిటీ గురుకులాల ద్వారా బాలికల విద్యాభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.

News November 11, 2025

ఈవీఎం గోడౌన్‌ వద్ద భద్రత పటిష్టం చేయాలి: కలెక్టర్

image

ఈవీఎం గోడౌన్‌ వద్ద పటిష్ట నిఘా ఉండాలని అధికారులను కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ ఆవరణలోని ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేశారు. సీల్స్, సీసీ కెమెరాలు, అగ్నిమాపక పరికరాలు, సైరన్ పనితీరును పరిశీలించారు. భద్రతా సిబ్బంది షిఫ్టులు, విధులను తెలుసుకొని, భద్రతాపరంగా ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని సూచించారు. తనిఖీలో రెవెన్యూ అధికారిణి పద్మశ్రీ, ఎన్నికల సూపరింటెండెంట్ రాజు పాల్గొన్నారు.

News November 11, 2025

ఖమ్మం జిల్లాలో 441 ఇందిరమ్మ ఇళ్లకు సమస్య

image

ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు నిలిచిపోవడంతో ఖమ్మం జిల్లాలో 441 మంది లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 52 మందికి నాలుగు చక్రాల వాహనాలు ఉన్నాయని, 260 మందికి గతంలో ఇల్లు మంజూరైందని అధికారులు బిల్లులు నిలిపివేశారు. మరో 129 ఇళ్లు బేస్మెంట్ పూర్తి కాగా అధికారులు పరిశీలించాల్సి ఉంది. దీంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.