News December 3, 2024
రాయితీపై సోలార్ రూఫ్ టాప్ నిర్మించుకోండి: నంద్యాల కలెక్టర్

ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన పథకం కింద గృహ వినియోగదారులకు రాయితీపై సోలార్ రూఫ్ టాప్‌లను ఏర్పాటు చేయనున్నామని, ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి తెలిపారు. సోమవారం నంద్యాల పీజిఆర్ఎస్ హాలులో ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకం గోడపత్రికలను కలెక్టర్ ఆవిష్కరించారు. ఆసక్తి ఉన్నవారు www. pmsuryaghar.gov.in/ APSPDCL వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని వారు తెలిపారు.
Similar News
News January 6, 2026
రాయలసీమ పారిశ్రామికాభివృద్ధి బ్లూప్రింట్

రాయలసీమలోని అన్ని జిల్లాలు సమానంగా వృద్ధి చెందేలా సమగ్ర పారిశ్రామిక ప్రణాళికను ప్రభుత్వం సిద్ధం చేసింది. జిల్లాలో ఉన్న వనరులు, అవకాశాలను బట్టి ప్రత్యేక పారిశ్రామిక హబ్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీంతో స్థానిక యువతకు ఉపాధి పెరగడమే కాకుండా ప్రాంతీయ అసమానతలు తొలగే అవకాశం ఉంది. జిల్లాల వారీగా పారిశ్రామిక ప్రాధాన్యతలు పై ఫొటోలో చూడొచ్చు. ఈ ప్రణాళిక సాకారం అయితే రాయలసీమ రతనాల సీమ కానుంది.
News January 6, 2026
కర్నూలు: ‘సంక్షేమ వసతి గృహాలు మెరుగ్గా పనిచేయాలి’

సంక్షేమ వసతి గృహాలు మెరుగ్గా పనిచేయాలని రాష్ట్ర BC వెల్ఫేర్ ఎక్స్-అఫీషియో కార్యదర్శి సత్యనారాయణ ఆదేశించారు. కర్నూలులోని సునయన ఆడిటోరియంలో మంగళవారం కర్నూలు, కడప, అనంతపురం అధికారులతో ఆయన సమావేశం నిర్వహించి మాట్లాడారు. సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థుల చదువు, ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలన్నారు. 100% ఉత్తీర్ణత సాధించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలన్నారు.
News January 5, 2026
పీహెచ్సీలో వైద్యులు రోగులకు అందుబాటులో ఉండాలి: కలెక్టర్

పీహెచ్సీలో వైద్యులు రోగులకు అందుబాటులో ఉండి మెరుగైన వైద్యసేవలు అందించాలని కలెక్టర్ డా. ఏ.సిరి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ నుంచి వైద్యాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్‌కు సంబంధించి చాలా అంశాలలో ప్రజల నుంచి మంచి ఫీడ్ బ్యాక్ వచ్చిందన్నారు. అయితే వైద్య ఆరోగ్యం, సర్వే, రెవెన్యూ అంశాల్లో ఇంకా కొంత పురోగతి సాధించాల్సిన అవసరం ఉందన్నారు.


