News December 3, 2024

శ్రీకాకుళం: ల్యాబ్ టెక్నీషియన్ గోండు మురళి సస్పెన్షన్

image

ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే ఆరోపణలపై ఏసీబీకి చిక్కిన ల్యాబ్ టెక్నీషియన్ గొండు మురళిని విధుల నుంచి సస్పెండ్ చేసినట్లుగా జిల్లా ఆస్పత్రుల సేవల సమన్వయాధికారి కల్యాణ్ బాబు ప్రకటించారు.  బుడితి CHCలో పని చేస్తున్న మురళీ ఇంటిపై ఇటీవల ACB దాడి చేసింది. రూ.50 కోట్ల అక్రమాస్తున్నట్లు గుర్తించి అరెస్ట్ చేసింది. కోర్టు ఆయనకు DEC 12 వరకు రిమాండ్ విధించింది. ఈయన గతంలో ధర్మాన కృష్ణదాస్ వద్ద పీఏగా పని చేశారు.

Similar News

News March 28, 2026

శ్రీకాకుళం: త్వరలో కాలేజీల్లో ఫేషియల్ రికగ్నేషన్ అటెండెన్స్

image

ప్రభుత్వం అందిస్తున్న ఫీజు రీయంబర్స్మెంట్ అర్హత సాధించాలంటే విద్యార్థులకు కనీసం 75 శాతం హాజరు ఉండాలి. మాన్యువల్ హాజరు వల్ల అనర్హులకు రియంబర్స్మెంట్ అందుతుందని ప్రభుత్వ భావన. అందుకే ఫేషియల్ రికగ్నేషన్ అటెండెన్స్ వచ్చే విద్యా సంవత్సరం నుంచి తప్పనిసరి చేస్తుంది. జిల్లాలో నాలుగు ఇంజినీరింగ్, 101 డిగ్రీ, 14 బీఈడీ, ఆరు పీజీ, 9 పాలిటెక్నిక్ తదితర కళాశాలల్లో రూ. కోట్లలో రియంబర్స్మెంట్ పొందుతున్నారు.

News March 28, 2026

శ్రీకాకుళం జిల్లాలోని ఈ ప్రాంతాల్లో హీట్ వేవ్

image

శ్రీకాకుళం జిల్లాలో శనివారం వడగాల్పులకు అవకాశం ఉన్నట్లు APSDMA ఎండీ ప్రఖర్ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రధానంగా ఆమదాలవలస, బూర్జలో వడగాల్పులకు అవకాశం ఉందని తెలియజేసింది. బూర్జ మండలంలో పలు ప్రాంతాల్లో గురువారం ఈదురు గాలులు, మెరుపులతో వడగళ్ల వాన సైతం కురుస్తుందని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలు ఎండలు అధికంగా ఉండే బయట తిరగరాదని విపత్తుల శాఖ హెచ్చరించింది.

News March 27, 2026

శ్రీకాకుళం జిల్లా టుడే టాప్ న్యూస్

image

★శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఘనంగా శ్రీరామనవమి వేడుకలు
★పొందూరు: హోటల్స్‌పై విజిలెన్స్ దాడులు.. కేసు నమోదు
★కవిటి: ఒకే కాన్పులో రెండు లేగ దూడలు జననం
★శ్రీకాకుళం: వీరి ప్రేమ కథ విషాదాంతం
★కొత్తూరు: గ్యాస్ కార్యాలయం వద్ద వినియోగదారుల ఇక్కట్లు
★బూర్జ: నేలకొరిగిన జొన్న పంట
★టెక్కలిలో 29న రగ్బీ జిల్లా జట్టు ఎంపికలు