News December 3, 2024
చెక్ బౌన్స్ కేసు.. హోంమంత్రి అనితపై హైకోర్టు అసహనం

AP: రూ.70 లక్షల చెక్ బౌన్స్ కేసులో ఎలా పడితే అలా పిటిషన్ వేయడం సరికాదని హోంమంత్రి అనితకు హైకోర్టు తేల్చిచెప్పింది. ఫిర్యాదుదారునితో తనకు రాజీ కుదిరినందున కేసు ప్రొసీడింగ్స్ కొట్టేయాలని ఆమె దాఖలు చేసిన పిటిషన్‌పై అసంతృప్తి వ్యక్తం చేసింది. రాజీలో ఏం కుదిరింది? సమస్యకు ఏం పరిష్కారం చూపారో చెప్పాలంది. పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 10కి వాయిదా వేసింది.
Similar News
News March 21, 2026
భారీగా పెరిగిన చికెన్ ధరలు!

రంజాన్ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు అమాంతం పెరిగాయి. నిన్నటి వరకు కేజీ రూ.330 వరకు విక్రయాలు జరిగాయి. ఇవాళ ఆ ధర భారీగా పెరిగి రూ.400కు చేరింది. విజయవాడలో కిలో స్కిన్‌లెస్ చికెన్ రూ.380-రూ.400 వరకు అమ్ముతున్నారు. హైదరాబాద్‌లో రూ.340-350 వరకు విక్రయిస్తున్నారు. ఎండల తీవ్రతకు ఉత్పత్తి తగ్గడమూ ధరల పెరుగుదలకు కారణమని వ్యాపారులు చెబుతున్నారు. మీ ప్రాంతంలో చికెన్ రేట్ ఎంత ఉంది?
News March 21, 2026
కల్తీని అరికట్టేలా.. తిరుమలలో ఫుడ్ ల్యాబ్ రెడీ!

తిరుమలలో వాటర్, ఫుడ్ అనాలసిస్ ల్యాబోరేటరీ సిద్ధమైంది. ₹25 కోట్ల వ్యయంతో నిర్మించిన ల్యాబ్‌ను ఇవాళ CM చంద్రబాబు ప్రారంభించనున్నారు. ప్రసాదాల్లో వినియోగించే ముడిసరకును ఇక్కడే తనిఖీ చేయనున్నారు. ఇందుకోసం అత్యాధునిక పరికరాలను అందుబాటులో ఉంచారు. సూక్ష్మస్థాయిలో కల్తీ జరిగినా గుర్తించేలా పరీక్షలు చేయనున్నారు. ఈ తరహా ఫుడ్ ల్యాబ్ ఓ పుణ్యక్షేత్రంలో ఏర్పాటు చేయడం దేశంలోనే తొలిసారి కావడం గమనార్హం.
News March 21, 2026
గుడ్‌న్యూస్.. ఒకేసారి 3 నెలల రేషన్!

ఏప్రిల్, మే, జూన్ నెలల ఉచిత రేషన్ ఒకేసారి పంపిణీ చేయాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈమేరకు రాష్ట్రాలకు ఆహార, ప్రజా పంపిణీ శాఖ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఈ నెలాఖరులోపు లబ్ధిదారులకు అధికారికంగా సమాచారం అందించే అవకాశం ఉంది. రాబోయే 3 నెలలు ఎండల తీవ్రత, గోదాముల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోవడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గత వర్షాకాలంలోనూ ఇలాగే పంపిణీ చేసింది.


