News December 3, 2024
పొన్నలూరు: తల్లితో కలిసి భర్తను హత్య చేసిన భార్య

గతనెల 23న HYDలో పొన్నలూరు(M) చెరుకూరు వాసి మార్క్(26) హత్యకు గురయ్యాడు. అతడు HYDలో నివాసం ఉంటూ సంగీతను వివాహం చేసుకున్నాడు. ఇద్దరి మధ్య గొడవలు జరుగుతుండగా.. మార్క్ స్వగ్రామం చెరుకూరుకు వెళ్లాడు. తిరిగివచ్చి చూడగా భార్య లేదు. వెంటనే భార్య పుట్టింటికి వెళ్లగా.. అక్కడ ఇద్దరి మధ్య గొడవ జరగడంతో భార్య, ఆమె తల్లి లక్ష్మి, తల్లితో సహజీవనం ఉంటున్న కాశీనాథ్ కలిసి మార్క్‌ను హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.
Similar News
News March 22, 2026
ఒంగోలులో జాబ్ మేళా.. రూ.41 వేల జీతం.!

ఒంగోలులోని జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈ నెల 24వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి రమాదేవి తెలిపారు. ఒంగోలులోని తన కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ.. పలు ప్రముఖ కంపెనీలు జాబ్ మేళాలో పాల్గొంటాయని, 18 నుంచి 35 ఏళ్ల వయసు గలవారు అర్హులని తెలిపారు. రూ.14 వేల నుంచి రూ.41 వేల వరకు వేతనం అందే అవకాశం ఉందన్నారు. టెన్త్ నుంచి డిగ్రీ పూర్తి చేసిన వారు ఎవరైనా ఇందులో పాల్గొనవచ్చన్నారు.
News March 22, 2026
ప్రకాశం: ‘నేడు కూడా కరెంట్ బిల్లులు చెల్లించవచ్చు’

ప్రకాశం జిల్లాలో ఆదివారం కూడా విద్యుత్ బిల్లు కౌంటర్లు తెరిచి ఉంటాయని SE కట్టా వెంకటేశ్వర్లు తెలిపారు. వినియోగదారుల సౌకర్యం కోసం ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. జిల్లాలోని అన్ని కౌంటర్లు పనిచేస్తాయని వెల్లడించారు. వినియోగదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. నిర్ణీత సమయంలో బిల్లు చెల్లించడం వలన పెనాల్టీ పడదని అన్నారు. ఆన్‌లైన్‌లో కూడా బిల్లులు చెల్లించవచ్చని చెప్పారు.
News March 22, 2026
గంజాయి నిందితులకు ఒంగోలులో కౌన్సెలింగ్

మత్తు పదార్థాల నియంత్రణలో భాగంగా ఒంగోలులో గతంలో గంజాయి కేసుల్లో ఉన్న నిందితులకు పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించారు. మహిళా పోలీస్ స్టేషన్ సీఐ సుధాకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గంజాయి వల్ల కలిగే చట్టపరమైన ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించారు. మత్తు పదార్థాల విక్రయం, వినియోగంపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనుమానాస్పద సమాచారం ఉంటే వెంటనే 112కు ఫిర్యాదు చేయాలని సూచించారు.


