News December 3, 2024

SKLM: ఒకే పులి మూడున్నరేళ్లుగా సంచారం 

image

పాతపట్నం పరిధిలోని చోడసముద్ర ప్రాంతంలో ఇటీవల పులి సంచారం విషయం తెలిసిందే. గడిచిన మూడున్నరేళ్లుగా ఇదే పులి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, మన్యం, ఒడిశా ప్రాంతాల్లోని అడవుల్లో సంచరిస్తోందని జిల్లా అటవీ శాఖ అధికారి వెంకటేష్, సిబ్బంది గుర్తించారు. పులి అడుగుల జాడతో ఇదే పులి ఇక్కడ సంచరిస్తోందని నిర్ధారించారు. ప్రస్తుతం అటవీ సిబ్బంది పులి పాదముద్రలను గుర్తించి ఆయా ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు.

Similar News

News January 18, 2026

రథసప్తమి వేడుకల పూర్తి షెడ్యూల్ వివరాలు ఇవే

image

ఈనెల 19 నుంచి 23వరకు జరగనున్న రథసప్తమి వేడుకల షెడ్యూల్ సంబంధిత అధికారులు ఆదివారం ప్రకటించారు. ఆ మూడు రోజులు హెలిప్యాడ్ రైడింగ్ ఉదయం 9-సాయంత్రం 5 వరకు ఉంటుంది. NTR మున్సిపల్ హైస్కూల్లో వివిధ రకాల క్రీడా పోటీలు జరుగుతాయి. KR స్టేడియంలో ఫుడ్ ఎగ్జిబిషన్ కిడ్స్ ప్లే జరుగుతుందన్నారు. 22న 80 ఫీట్ రోడ్డులో 7 గంటల-మెగాసూర్య నమస్కారాలు, సాయంత్రం 5 గంటల నుంచి భక్తి హాస్యపు జల్లులు 23న శోభా యాత్ర ఉంటుంది.

News January 18, 2026

అరసవల్లిలో VIP పాస్ ఇలా పొందండి..!

image

అరసవల్లి రథసప్తమి ఉత్సవాలకు సంబంధించి ప్రత్యేకంగా దాతల పాస్‌లు అందుబాటులోకి తెచ్చారు. నేటి నుంచి ఈనెల 23వ తేదీ వరకు ఇస్తామని ఈవో ప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు. VIP పాస్‌లను రూ.300లకు అందజేస్తామన్నారు. జిల్లా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికార సిఫార్సు లేఖలతో పాటు ఆర్డీవో ఆఫీసు అదనపు లేఖల ద్వారా VIP పాస్‌లు ఇస్తామని చెప్పారు.

News January 18, 2026

రథసప్తమి వేడుకలకు పటిష్ఠ బందోబస్తు: ఐజీ

image

అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలను వైభవంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ ఏర్పాట్లు చేస్తోందని విశాఖ రేంజ్ ఐజీ గోపీనాథ్ జట్టి తెలిపారు. శనివారం జిల్లా ఎస్పీ, డీఎస్పీలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని క్యూలైన్లు, బారికేడ్లు, వాహనాల పార్కింగ్ మరియు రూట్ మ్యాప్‌లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.