News December 3, 2024
సంగారెడ్డి: భర్తను చంపిన భార్య

సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం మక్తక్యాసారంలో సోమవారం భర్తను భార్య హత్య చేసింది. సీఐ వివరాల ప్రకారం.. శంషాబాద్‌కు చెందిన సంపత్(39) మక్తక్యాసారంకి చెందిన మంజుల దంపతులు. సంపత్ ప్రతిరోజు మద్యంతాగి గొడవపడే వాడు. సోమవారం మద్యం తాగి రావడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగి సంపత్ తలపై కట్టెతో కొట్టి వరండాలోకి పడేయంతో అతడి తలకి గచ్చుబండ తాకింది. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదైంది.
Similar News
News March 8, 2026
తెలంగాణ ఉద్యమంలో మహిళల పాత్ర గొప్పది: కేసీఆర్

మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు సామాజిక సంపద సృష్టికర్తలని, దేశాభివృద్ధిలో పురుషులతో సమానంగా స్త్రీల భాగస్వామ్యం ఉందన్నారు. మానవ మనుగడను కొనసాగించే గొప్పబాధ్యతను అనేక కష్టాలను భరిస్తూ నిర్వర్తిస్తున్న మహిళ త్యాగశీలి అని కొనియాడారు. అన్ని రంగాల్లో మహిళలకు సమాన అవకాశాలు కల్పించినప్పుడే కుటుంబం, సమాజం, దేశం అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు.
News March 8, 2026
మెదక్: 4 పురపాలికల ప్రథమ పౌరులు మహిళలే..!

మెదక్ జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలకు మహిళలే ప్రథమ పౌరులుగా ఎన్నికై రికార్డు సృష్టించారు. మెదక్‌లో కానుగు రాధిక, రామాయంపేటలో లావణ్య, తూప్రాన్‌లో రాజమణి, నర్సాపూర్‌లో లక్ష్మి మున్సిపల్ ఛైర్‌పర్సన్లుగా బాధ్యతలు చేపట్టారు. రిజర్వేషన్లు కలిసి రావడంతో నలుగురు మహిళా నేతలే పాలనా పగ్గాలు చేపట్టడం విశేషం. తమదైన ముద్ర వేస్తూ పట్టణాల అభివృద్ధికి కృషి చేస్తామని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
News March 7, 2026
MDK: యువతే దేశ భవిష్యత్: అదనపు ఎస్పీ

మెదక్ జిల్లా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్–2026 జిల్లా స్థాయి పోటీలలో అదనపు ఎస్పీ ఎస్.మహేందర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. “50 Years of Emergency – Lessons for Indian Democracy” అంశంపై జరిగిన ఈ కార్యక్రమంలో యువతే దేశ భవిష్యత్ అని ఆయన పేర్కొన్నారు. ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగం పట్ల అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు.


