News December 3, 2024

టీడీపీలోకి YCP మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని?

image

AP: వైసీపీ మాజీ నేత ఆళ్ల నాని టీడీపీలో చేరుతున్నట్లు తెలుస్తోంది. ఇవాళ సీఎం చంద్రబాబు సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకుంటారని సమాచారం. ఇప్పటికే ఆయన వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తొలుత ఆయన జనసేనలోకి వెళ్తారని వార్తలు వచ్చినా, చివరకు టీడీపీ గూటికే చేరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా నాని గతంలో మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఓసారి డిప్యూటీ సీఎంగా పనిచేశారు.

Similar News

News March 24, 2026

సింహాచలం: రూ.15.55 కోట్లకు తలనీలాల షీల్డ్ టెండర్

image

సింహాచలం వరాహ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో దేవస్థానం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సింగం రాధ ఆధ్వర్యంలో తలనీలాల షీల్డ్ టెండర్‌కు మంగళవారం బహిరంగ వేలం నిర్వహించారు. ఈ వేలంలో రూ.15.55 కోట్లకు తమిళనాడుకు చెందిన దురై ఎంటర్‌ప్రైజెస్ దక్కించుకుంది. ఏప్రిల్ 1 నుంచి 2028 మార్చి 31 వరకు ఈ టెండర్ అమలులో ఉండనుంది. గత వేలం పాటలతో పోలిస్తే ఈసారి దేవస్థానానికి గణనీయమైన ఆదాయం లభించిందన్నారు.

News March 24, 2026

డీలిమిటేషన్‌పై పోరాటానికి సిద్ధం కావాలి: రేవంత్

image

TG: దక్షిణాది రాష్ట్రాల అవసరం లేకుండానే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాలని BJP అనుకుంటోందని CM రేవంత్ ఆరోపించారు. డీలిమిటేషన్‌పై TV9 సమ్మిట్‌లో మాట్లాడుతూ ‘ఏ లెక్క ప్రకారం 50% సీట్ల పెంపు ఉంటుంది. జనాభా ఆధారంగా సీట్లు పెంచితే దక్షిణాదికే నష్టం. సీట్ల పెంపుపై చర్చ జరగాలి. 50% పెంపులోనే కుట్ర ఉంది. డీలిమిటేషన్‌పై దక్షిణాది రాష్ట్రాలు పోరాటానికి సిద్ధం కావాలి’ అని పిలుపునిచ్చారు.

News March 24, 2026

IPL నుంచి తప్పుకున్న ENG బ్యాటర్!

image

IPL-2026 నుంచి ENG బ్యాటర్ బెన్ డకెట్(DC) తప్పుకున్నట్లు CricBuzz వెల్లడించింది. ఇంటర్నేషనల్ కెరీర్‌పై ఫోకస్ చేసేందుకు ఆయన IPLను స్కిప్ చేస్తున్నట్లు సమాచారం. BCCI రూల్ ప్రకారం ఆయనపై రెండేళ్ల నిషేధం పడే అవకాశం ఉంది. ఆక్షన్‌లో ఎంపికైన తర్వాత టోర్నీ నుంచి తప్పుకునే ప్లేయర్లను బ్యాన్ చేయాలని గతేడాది కొత్త రూల్‌ను తీసుకొచ్చారు. అటు CSKలోకి నాథన్ ఎల్లిస్ స్థానంలో AUS పేసర్ స్పెన్సర్ జాన్సన్ రానున్నారు.