News December 3, 2024

గూడూరు: వరదలో కొట్టుకుపోయిన యువకులు

image

గూడూరు నియోజకవర్గం చిట్టమూరు మండలం తాగేడు సమీపంలోని బాలచంద్ర రెడ్డి భవనం దగ్గర వరద ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఈక్రమంలో ఇద్దరు యువకులు బైకుపై మల్లాం వైపు వెళ్లేందుకు వాగు దాటేందుకు ప్రయత్నించారు. బైకుతో సహా ఇద్దరు యువకులు నీటిలో కొట్టుకుపోయారు. పోలీసులు, గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. నెల్లూరుకు చెందిన మధు రెడ్డి, ఒడిశాకు చెందిన షారుక్ కొట్టుకెళ్లినట్లు స్థానికులు గుర్తించారు.

Similar News

News December 4, 2024

అల్లూరు: దెయ్యం పేరుతో బురిడీ

image

అల్లూరు మండలంలో ముగ్గురు వ్యక్తులు ఓ స్వామి మాల ధరించి ఒక వ్యక్తి దగ్గర నుంచి బంగారు నగలు అపహరించారు. అమాయక ప్రజలే టార్గెట్‌గా చేసుకొని ఇంట్లో దెయ్యం ఉందని నమ్మించారు. పూజలు చేస్తే దెయ్యం వెళ్లిపోతుందన్నారు. అనంతరం బాధితుడి నుంచి బంగారు నగలు అపహరించుకొని వెళ్లిపోయారు. దీంతో బాధితుడు స్థానిక అల్లూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

News December 4, 2024

మత్స్యకారుల సంక్షేమానికి తీసుకుంటున్న చర్యలేంటి: ఎంపీ వేమిరెడ్డి

image

దేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మత్స్యకారుల సంక్షేమానికి కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వివరించాలని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి బుధవారం కోరారు. లోక్‌సభలో ఆయన మత్స్యకారుల సంక్షేమానికి సంబంధించి పలు ప్రశ్నలు వేశారు. ఆంధ్రప్రదేశ్‌లో మత్స్యకారుల నైపుణ్యాభివృద్ధికి, శిక్షణ అందించడానికి ప్రభుత్వం ఏదైనా పథకాలను అమలు చేస్తుందా అని ప్రశ్నించారు.

News December 4, 2024

కొండాపురం; 30 మంది సచివాలయం సిబ్బందికి మెమోలు

image

కొండాపురం మండలంలో పనిచేసే 30 మంది సచివాలయం సిబ్బందికి ఎంపీడీవో ఆదినారాయణ బుధవారం మెమోలు ఇచ్చారు. దీంతో సచివాలయ ఉద్యోగుల్లో కలకలం రేగింది. సచివాలయాల్లో తనిఖీలు నిర్వహించిన ఎంపీడివో పలు విషయాలను గుర్తించినట్లు తెలిపారు. మెమోలిచ్చిన వారంతా సచివాలయాల విధులకు సక్రమంగా హాజరు కావడం లేదని గుర్తించినట్లు పేర్కొన్నారు. వీరు ఇదేవిధంగా ప్రవర్తిస్తే ఉన్నతాధికారులకు తెలిపి చర్యలు తీసుకుంటామని చెప్పారు.