News December 3, 2024

వనపర్తి: యాక్సిడెంట్.. అక్కాతమ్ముడి మృతి

image

రోడ్డు ప్రమాదంలో అక్కాతమ్ముడు మృతి చెందారు. పోలీసుల వివరాల ప్రకారం.. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయపల్లికి చెందిన మనోజ్(25) అక్క పద్మ(31)ను ఆమె కుటుంబంతో కుంట్లూర్‌కు బయలుదేరారు. కోహెడ-పెద్దఅంబర్‌పేట ఔటర్‌రింగ్‌లో లారీ అకస్మాత్తుగా నిలపడంతో వేగంగా వస్తున్న వీరి కారు ఢీకొంది. ఈప్రమాదంతో మనోజ్, పద్మ మృతిచెందారు. మృతుల తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News March 11, 2026

దేవరకద్రలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు

image

మహబూబ్ నగర్ జిల్లాలో జిల్లాలో ఎండల తీవ్రత పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో దేవరకద్రలో అత్యధికంగా 38.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గండీడు (36.0), భూత్పూర్ (35.7), కోయిలకొండ (35.6) మండలాల్లోనూ ఎండ ప్రభావం అధికంగా ఉంది. చిన్నచింతకుంట, అడ్డాకుల, నవాబుపేట ప్రాంతాల్లో 34 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మార్చిలోనే ఎండలు ముదురుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

News March 10, 2026

హెచ్‌సీఏ సెక్రటరీగా పాలమూరు వాసి నియామకం

image

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) సెక్రటరీగా పాలమూరు జిల్లాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత మన్నే జీవన్ రెడ్డి నియమితులయ్యారు. మంగళవారం ఆయన తన నియామక పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన క్రీడాకారులను వెలుగులోకి తెచ్చి, తెలంగాణలో క్రికెట్ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ప్రకటించారు.

News March 10, 2026

MBNR: డ్రగ్స్ రవాణాపై ఉక్కుపాదం – కలెక్టర్

image

జిల్లాలో మత్తు పదార్థాల అక్రమ రవాణాను కఠినంగా అరికట్టాలని కలెక్టర్ కుష్బూ గుప్త అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. గంజాయి, డ్రగ్స్ వల్ల విద్యార్థుల భవిష్యత్తు నాశనమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి మత్తు రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని సూచించారు.