News December 3, 2024
DyEO, AEE పోస్టులకు రాత పరీక్షల తేదీల ఖరారు

AP: రాష్ట్రంలో పలు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్ష తేదీలను APPSC ప్రకటించింది. అసిస్టెంట్ లైబ్రేరియన్ పోస్టులకు మార్చి 24, 25, ఏపీ పొల్యూషన్ బోర్డులో అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీర్(AEE) ఉద్యోగాలకు మార్చి 25న రెండు షిప్టుల్లో ఎగ్జామ్స్ నిర్వహిస్తామంది. గ్రేడ్-2 అనలిస్ట్ పోస్టులకు మార్చి 25, 26, డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్(DyEO) ఉద్యోగాలకు మార్చి 26, 27 తేదీల్లో పరీక్షలు జరుగుతాయంది.
Similar News
News March 22, 2026
ఉస్తాద్ భగత్‌సింగ్ టికెట్ రేట్స్ తగ్గింపు

AP: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్‌సింగ్ సినిమా టికెట్ ధరలు రాష్ట్రంలో రేపటి నుంచి తగ్గనున్నాయి. ఉగాదికి రిలీజైన ఈ మూవీకి 10రోజుల పాటు హైక్‌కు ప్రభుత్వం అనుమతించింది. అయితే TGతో సమానంగా ధరలను ఉంచేందుకు మేకర్స్ రేపటి నుంచే తగ్గించాలని డిసైడ్ అయ్యారు. టికెట్ ధరలు సింగిల్ స్క్రీన్స్‌లో ₹100, మల్టీప్లెక్స్‌లలో ₹125 తగ్గనున్నాయి. దీంతో థియేటర్లకు వచ్చే ఆడియన్స్ సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
News March 22, 2026
ఇదేందయ్యా ఇది.. మటన్ ఉడకలేదని పోలీస్ స్టేషన్‌కు..

AP: అనంతపురం పోలీసులకు వింత ఫిర్యాదు అందింది. తాడిపత్రికి చెందిన ఓ వ్యక్తి ఉగాది సందర్భంగా మటన్, తలకాయ కొనుగోలు చేశాడు. కుక్కర్‌లో సుమారు 20 సార్లు ఉడికించినా ఆ మాంసం ఉడకలేదని విక్రయదారుడిపై ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. వండిన పాత్రతో సహా వెళ్లడంతో పోలీసులు అవాక్కయ్యారు. అతనికి సర్ది చెప్పి ఇంటికి పంపించారు.
News March 22, 2026
ఈ గ్రామంలో వర్షమే కురవదు!

యెమెన్‌లోని అల్ హుతైబ్ గ్రామం ప్రపంచంలోనే అత్యంత వింతైన ప్రదేశం. సముద్ర మట్టానికి సుమారు 3,200 మీటర్ల ఎత్తున పర్వత శిఖరంపై ఉండటం వల్ల ఇక్కడ అసలు వర్షమే కురవదు. మేఘాలన్నీ ఈ గ్రామం కంటే తక్కువ ఎత్తులోనే ఏర్పడటం వల్ల వర్షం పడదు. అందుకే దీనిని ‘డ్రై సిటీ’ అని పిలుస్తారు. ఇక్కడ మేఘాలు చేతికి తాకే ఎత్తులోనే ఉండటం విశేషం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ‘వంద రోజుల్లో-వంద వింతలు’లో


