News December 3, 2024
రికార్డు సృష్టించిన ‘పుష్ప-2’

అల్లు అర్జున్ ‘పుష్ప-2’ సినిమా టికెట్ బుకింగ్స్‌లో రికార్డు సృష్టించింది. బుక్ మై షోలో అత్యంత వేగంగా 10 లక్షల టికెట్స్ బుకింగ్ జరిగినట్లు మేకర్స్ వెల్లడిస్తూ ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈనెల 5న ఈ చిత్రం రిలీజ్ కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో టికెట్స్ ధరలు పెంచుకునేందుకు ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. దీంతో ఇప్పటికే తెలంగాణలో బుకింగ్స్ మొదలవగా వేగంగా అమ్ముడవుతున్నాయి.
Similar News
News March 28, 2026
ఒక్కో సినిమాకు రూ.15-20 కోట్లు.. నిర్మాతల భయం!

‘పుష్ప’, ‘పుష్ప-2’ సినిమాలతో మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్‌కు తెలుగులో ఎన్నో ఆఫర్లు వచ్చాయి. కానీ ఆయన ఒక్క మూవీ కూడా ఒప్పుకోలేదు. ఒక్కో చిత్రానికి రూ.15-20 కోట్ల వరకు డిమాండ్ చేయడమే దీనికి కారణమని టాలీవుడ్ వర్గాల టాక్. ఆ రెమ్యునరేషన్ ఇచ్చేందుకు భయపడే నిర్మాతలు ముందుకు రావట్లేదని సమాచారం.
News March 28, 2026
ఈ లెజెండరీ IPL టీమ్‌పై మీ అభిప్రాయం?

IPL చరిత్రలోని బెస్ట్ ప్లేయర్స్‌తో కూడిన టీమ్‌ను స్పోర్ట్స్‌కీడా ఇలా సెలక్ట్ చేసింది. వార్నర్, రోహిత్ (కెప్టెన్) ఓపెనర్లుగా, కోహ్లీ, రైనా, డివిలియర్స్ మిడిల్ ఆర్డర్‌లో బలంగా నిలుస్తారు. ధోని కీపర్‌గా.. పాండ్య, జడేజా ఆల్‌రౌండర్లుగా రాణిస్తారు. బౌలింగ్‌లో సునీల్ నరైన్, బుమ్రా, మలింగ, యుజ్వేంద్ర చాహల్ ఉన్నారు. ఈ జట్టుపై మీ అభిప్రాయం ఏంటి? ఏదైనా మార్పులు చేస్తారా? Comment
News March 28, 2026
ప్రభుత్వాలు మారినప్పుడల్లా నిర్ణయాలు మారకూడదు: స్పీకర్

AP రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కేంద్రాన్ని కోరుతూ CM CBN అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా నిర్ణయాలు మారకూడదన్నారు. ‘శాశ్వత రాజధాని నిర్మాణానికి సీఎం సంకల్పించారు. ఆంధ్రుల ఆకాంక్షకు ఈ సభ ప్రతిరూపం. 2019లో రాజధాని ప్రగతికి అడ్డంకులు ఎదురయ్యాయి. దాన్ని శాశ్వతంగా తొలగించే యజ్ఞమిది’ అని పేర్కొన్నారు.


