News December 3, 2024
వర్షాలు.. రాష్ట్రానికి మరో ముప్పు

AP: ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలో ఇప్పటికే వర్షాలు పడుతుండగా, మరో ముప్పు పొంచి ఉంది. నైరుతి బంగాళాఖాతంలో ఈ నెల 2వ వారంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయి. ఇది బలపడి వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. తుఫాన్‌గా మారే అవకాశం ఉందా? లేదా? అనే దానిపై ఈ వారం తర్వాత స్పష్టత వస్తుందని చెబుతున్నారు.
Similar News
News January 14, 2026
పసిపిల్లలను ఎండలో ఎందుకు ఉంచాలంటే?

చిన్నారులకు ఇలా ఎండ తగిగేలా చేయడం వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి. ఉదయం వచ్చే సూర్య రశ్మిపడితే శరీరానికి విటమిన్ డి లభిస్తుందనే విషయం తెలిసిందే. ఇది చిన్నారుల శరీరంలో కాల్షియం సంగ్రహించడానికి ఉపయోగపడుతుంది. మరీ ముఖ్యంగా నెలలు నిండకముందు జన్మించిన చిన్నారుల్లో సూర్య రశ్మి ఎంతో మేలు చేస్తుంది. పిల్లల్లో వచ్చే కామెర్ల సమస్యను కూడా దూరం చేయవచ్చు.
News January 14, 2026
సంక్రాంతికి గాలిపటాలు ఎందుకు ఎగురవేస్తారు?

సంక్రాంతి రోజున గాలిపటాలు ఎగురవేయడం వెనుక పురాణ, ఆరోగ్య, చారిత్రక కారణాలున్నాయి. రామాయణం ప్రకారం రాముడు తొలిసారిగా ఈ రోజునే గాలిపటం ఎగురవేశారని నమ్మకం. చలికాలంలో ఎండలో గాలిపటాలు ఎగురవేస్తే శరీరానికి కావాల్సిన విటమిన్-డి అందుతుంది. ఇదొక శారీరక వ్యాయామంగానూ ఉపయోగపడుతుంది. చైనాలో పుట్టిన ఈ గాలిపటాల సంప్రదాయం, కాలక్రమేణా సందేశాల రవాణా నుంచి ఉత్సాహభరితమైన వేడుకగా రూపాంతరం చెంది అందరినీ అలరిస్తోంది.
News January 14, 2026
FDDIలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

హైదరాబాద్‌లోని ఫుట్‌వేర్ డిజైన్ & డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ (<


