News December 3, 2024
స్పేస్‌లో ట్రాఫిక్ జామ్!

లో ఎర్త్ ఆర్బిట్ (LEO)లోని ఉపగ్రహాల రద్దీ కారణంగా భూమి కక్ష్యలో ట్రాఫిక్ జామ్‌ను గుర్తించారు. ప్రస్తుతం భూమి చుట్టూ 14,000 ఉపగ్రహాలు తిరుగుతుండగా వాటిలో దాదాపు 3,500 ఉపగ్రహాలు క్రియారహితంగా ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతేకాకుండా, గత ఉపగ్రహ ప్రయోగాలు, ఘర్షణల ద్వారా 120 మిలియన్ల శిథిలాలు కక్ష్యలోనే ఉండిపోయాయని అంచనా వేశారు. భవిష్యత్తులో ఇది అంతరిక్ష కార్యకలాపాలకు ముప్పు అని హెచ్చరించారు.
Similar News
News March 14, 2026
రఘు భాయ్.. ది రియల్ హీరో

టీమ్ఇండియా టీ20 వరల్డ్ కప్ విజయం తర్వాత నెట్టింట ఒకరి పేరు మారుమోగుతోంది. ఆయనే రాఘవేంద్ర (రఘు భాయ్). ఒకప్పుడు కేవలం ₹21తో ఇంటి నుంచి బయటకొచ్చి క్రికెట్ కోసం పోరాడిన ఆయన ప్రస్థానం ఎందరికో స్ఫూర్తి. నెట్స్‌లో గంటకు 150 కి.మీ వేగంతో బంతులు విసిరి, మన బ్యాటర్లను ప్రపంచ విజేతలుగా తీర్చిదిద్దడంలో ఆయన పాత్ర కీలకం. అందుకే విరాట్ కోహ్లీ వంటి స్టార్లే ఆయనను టీమ్‌ఇండియాకు నిజమైన హీరోగా అభివర్ణిస్తున్నారు.
News March 14, 2026
దారుణం.. యువతికి HIV రక్తం ఎక్కించాడు!

TG: HIV సోకిన ఓ యువకుడు దారుణానికి పాల్పడ్డాడు. మేడ్చల్ (D) అన్నోజిగూడలో ఇటీవల మనోహర్ అనే యువకుడికి ఓ యువతితో నిశ్చితార్థం జరిగింది. అతడికి HIV పాజిటివ్ అని తెలియడంతో అమ్మాయి పేరెంట్స్ పెళ్లికి నిరాకరించారు. కక్ష పెంచుకున్న మనోహర్ ఈనెల 11న యువతి ఇంటికి వెళ్లి సిరంజితో ఆమెకు HIV ఉన్న రక్తాన్ని ఎక్కించాడు. ఇటీవల యువతికి జ్వరం రావడంతో విషయం బయటపడింది. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
News March 14, 2026
రెండోసారి తల్లయిన నటి పూర్ణ

టాలీవుడ్ నటి పూర్ణ రెండోసారి తల్లయ్యారు. ఇవాళ ఉదయం పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చినట్లు ఆమె భర్త ఆసిఫ్ ఆలీ సోషల్ మీడియాలో వెల్లడించారు. ఎలాంటి సమస్యలు లేకుండా సురక్షితంగా డెలివరీ అయినందుకు దేవుడికి కృతజ్ఞతలు తెలిపారు. పూర్ణ 2022లో వ్యాపారవేత్త ఆసిఫ్ ఆలీని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. 2023లో బాబుకు జన్మనిచ్చారు. ఈమె తెలుగులో సీమ టపాకాయ్, అవును, సుందరి, అఖండ తదితర చిత్రాల్లో నటించారు.


