News December 3, 2024

ఫేస్‌బుక్ పరిచయం.. మహిళను ముంచేసింది

image

ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన వ్యక్తి తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడంటూ ఓ మహిళ గుంటూరు ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. బాధితురాలు చెప్పిన వివరాల మేరకు.. బాలాజీ నగర్‌లో ఉంటున్న మహిళకు గతంలో వివాహమైంది. ప్రస్తుతం ఓ దుకాణంలో సేల్స్ విభాగంలో పని చేస్తోంది. ఫేస్‌బుక్ ద్వారా ప్రొద్దుటూరుకి చెందిన ఓ వ్యక్తి పరిచయమై పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. రూ.17 లక్షలు ఆమె నుంచి తీసుకుని మొహం చాటేశాడు.

Similar News

News March 20, 2026

GNT: చిన్న శివలింగం వెనుక పెద్ద కథ.. లోకేశ్ వివరణ

image

పూజ గదిలో ఉన్న బొమ్మలపై వచ్చిన ప్రశ్నలకు మంత్రి నారా లోకేశ్ Xలో స్పందించారు. నాలుగేళ్ల వయసులో తన కుమారుడు దేవాన్ష్ తయారు చేసిన శివుడి బొమ్మ, చిన్న శివలింగాన్ని జ్ఞాపకంగా పూజా గదిలో ఉంచినట్లు తెలిపారు. చిన్న వయసులోనే శివ భక్తుడిగా ఎదుగుతున్నాడని చెప్పారు. భక్తి అనేది కొందరికి అర్థమవుతుందని, మరికొందరికి కాదని, అలాంటి భక్తికి వివరణ అవసరం లేదని పేర్కొన్నారు.

News March 20, 2026

గుంటూరులో ప్రత్యేక డ్రైవ్.. రూ.5.36 లక్షల జరిమానా

image

గుంటూరు జిల్లా నందివెలుగు రోడ్డు, కాకాని రోడ్డులో పోలీసులు జాతీయ, రాష్ట్ర రహదారులపై గురువారం సాయంత్రం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. 922 వాహనదారులకు రూ.5.36 లక్షల జరిమానా విధించినట్లు ఎస్పీ వెల్లడించారు. హెల్మెట్, సీటు బెల్ట్, లైసెన్స్, వాహన ధ్రువపత్రాలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలు తగ్గించడం, ప్రజల భద్రత పెంచడం ప్రధాన లక్ష్యం అని గుంటూరు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు.

News March 19, 2026

గుంటూరులో 8 మంది అధికారులపై వేటు

image

GNT నగరపాలక సంస్థలో అక్రమ కట్టడాలకు సహకరించిన 8 మంది టౌన్ ప్లానింగ్ అధికారులపై ప్రభుత్వం కఠిన చర్యలకు ఆదేశించింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించడంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడిందని ఉన్నతాధికారులు నిర్ధారించారు. శారద, వెంకటరావమ్మ, రిజ్వానా, మల్లికార్జున, సురేఖ, హరిజానాయక్, అశోక్ కుమార్, సత్యనారాయణలపై AP సివిల్ సర్వీసెస్ నిబంధనల ప్రకారం చర్యలు చేపట్టాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.