News December 3, 2024

షాద్ నగర్: ప్రశంసలే కాదు..విమర్శలు కూడా స్వీకరిస్తా: MLA

image

ఏడాది పాలన పూర్తి చేసుకున్న షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ను పలువురు మర్యాదపూర్వకంగా కలుసుకొని పూల బొకేలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. తనకు పూల బొకేతో శుభాకాంక్షలు తెలపడం సంతోషంగా ఉందన్నారు. తప్పులు జరిగినప్పుడు విమర్శించినా స్వీకరిస్తానని, సమస్యలు ఉంటే తన దృష్టికి తెచ్చినప్పుడు తప్పనిసరిగా పరిష్కరిస్తానని పేర్కొన్నారు.

Similar News

News March 22, 2026

కేంద్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి: డీకే అరుణ

image

మహబూబ్‌నగర్ ఎంపీ క్యాంపు కార్యాలయంలో వివిధ చేతివృత్తుల కుల సంఘాలతో ఎంపీ డీకే అరుణ శనివారం సమావేశమయ్యారు. విశ్వకర్మ, గొల్ల కురుమ, ఇతర బీసీ కుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. వారికి కేంద్ర ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీ సూచించారు. స్వర్ణకారులకు రుణ సదుపాయాల కల్పనతో పాటు, వారి విజ్ఞప్తులను కేంద్రం దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు.

News March 21, 2026

పాలమూరు:GET READY.. నేడే రంజాన్

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా పవిత్ర రంజాన్ (ఈద్-ఉల్- ఫితార్) మాసం నేపథ్యంలో సామూహిక ప్రార్థనల (నమాజ్) కోసం ఈద్గా, మస్జీద్ ల వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈద్ నమాజ్ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముస్లింలు గత నెలరోజుల పాటు కఠిన ఉపవాస దీక్షలు, ప్రతిరోజు ఐదు పూటలా నమాజ్, ప్రత్యేక తరావీ నిర్వహించారు. రంజాన్ పండుగ నేపథ్యంలో నేడు సందడి నెలకొననుంది.
#ఈద్ ముబారక్

News March 20, 2026

MBNR: రంజాన్ ఎంతో పవిత్రమైనది: ఎస్పీ

image

రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా ఎస్పీ డి.జానకి ముస్లింలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ పండుగ అందరి జీవితాల్లో ఆనందం, శాంతిని నింపాలని ఆమె ఆకాంక్షించారు. ఉపవాస దీక్షల ద్వారా పొందే ఆత్మశుద్ధి, సహనం, సేవాభావం సమాజానికి ఆదర్శంగా నిలుస్తాయని ఈ సందర్భంగా ఎస్పీ పేర్కొన్నారు.