News December 3, 2024

రంగుల దీపాల్లో గాంధీ మెడికల్ కాలేజీ, ఆసుపత్రి భవనాలు

image

తెలంగాణ రైజింగ్ పేరున ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాల సందర్భంగా గాంధీ మెడికల్ కాలేజీ, గాంధీ ఆస్పత్రిలో ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాత్రి గాంధీ ఆస్పత్రి, గాంధీ మెడికల్ కాలేజీ భవనాలను రంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. రంగురంగుల విద్యుత్ దీపాలతో రెండు భవనాలు అందరిని ఆకర్షించాయి.

Similar News

News March 25, 2026

ప్రజాపాలనలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు: RR కలెక్టర్

image

ప్రజాపాలనలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి హెచ్చరించారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్‌లో ప్రజాపాలన- ప్రగతి ప్రణాళికపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీ, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ ఫైల్స్ క్లియర్ చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు చంద్రారెడ్డి, శ్రీనివాస్, డీఆర్వో సంగీత, తదితరులు ఉన్నారు.

News March 25, 2026

రంగారెడ్డి జిల్లాలో 13 మంది MLAలు అయ్యే చాన్స్

image

రంగారెడ్డి జిల్లాలో ప్రస్తుతం ఉన్న 8 నియోజకవర్గాల సంఖ్య 13కు చేరే అవకాశం ఉంది. రాజేంద్రనగర్‌లో కొత్తగా శంషాబాద్ ఏర్పడనుంది. మహేశ్వరం నుంచి కొత్తగా సరూర్‌నగర్ పేరుతో మరో నియోజకవర్గం ఏర్పడే అవకాశం ఉంది. ఎల్బీనగర్ నుంచి కొత్తగా హయత్‌నగర్ మరో నియోజకవర్గంగా ఏర్పడే అవకాశం ఉంది. ఇబ్రహీంపట్నంలో కొంత భాగాన్ని దీనిలో కలిపే ఛాన్స్ ఉంది. ఈ మేరకు కొత్త నేతలకు అవకాశాలు లభించనున్నాయి.

News March 25, 2026

రంగారెడ్డి: మరో 5 అసెంబ్లీ స్థానాలు ఏర్పడే అవకాశం

image

నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా రంగారెడ్డి జిల్లాలో కొత్తగా మరో 5 అసెంబ్లీ స్థానాలు ఏర్పడే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం 24,46,265 మంది ఉండగా, 2024 డిసెంబర్ నాటికి కేవలం 18 ఏళ్లు నిండిన ఓటర్ల సంఖ్యే 35,91,987కు చేరడం గమనార్హం. వీరిలో 526 గ్రామ పంచాయతీల పరిధిలో 7,94,653 మంది ఓటర్లు ఉండగా, 6 మున్సిపాలిటీల పరిధిలో 1,75,974 మంది ఉన్నారు.