News December 3, 2024

‘పుష్ప-3’ సినిమా టైటిల్ ఇదే!

image

బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టిన ‘పుష్ప’ మూవీ సీక్వెల్ ‘పుష్ప-2’ మరో రెండ్రోజుల్లో విడుదల కానుంది. అయితే, ‘పుష్ప-3’ కూడా ఉండనుందని సినీవర్గాలు పేర్కొన్నాయి. ‘పుష్ప-2’ టైటిల్ ఎండ్ కార్డులో ‘పుష్ప-3.. ది ర్యాంపేజ్’ అని పోస్టర్ రివీల్ చేస్తారని తెలిపాయి. ఎడిటింగ్ రూమ్‌లో దిగిన ఫొటోను చిత్రయూనిట్ షేర్ చేయగా అందులో వెనకాల ‘పుష్ప-3’ పోస్టర్ ఉండటం గమనార్హం. దీనిపై త్వరలో క్లారిటీ రానుంది.

Similar News

News December 26, 2025

‘ఇండియా నన్ను బాగు చేసింది’.. NRI పోస్ట్ వైరల్

image

తన అనారోగ్యాన్ని ఇండియా నయం చేసిందని ఓ NRI చేసిన పోస్ట్ వైరలవుతోంది. ‘పదేళ్ల క్రితం US వెళ్లా. డేటా సైంటిస్టుగా పని చేస్తుండగా schizoaffective డిజార్డర్ (మానసిక వ్యాధి) ఉన్నట్లు 2018లో తేలింది. US హెల్త్ కేర్ సిస్టమ్ నన్ను భయపెట్టింది. దీంతో 2024లో ఇండియాకు వచ్చా. ఇప్పుడు నాకు నయమైంది. ఇక్కడి హెల్త్ సిస్టమ్, డాక్టర్ల వల్లే ఇది సాధ్యమైంది. నన్ను మనీ మెషీన్లుగా చూడలేదు’ అని రెడిట్‌లో రాసుకొచ్చారు.

News December 26, 2025

ఏపీ న్యూస్ అప్‌డేట్స్

image

*మత్స్యకారులకు 40% సబ్సిడీతో త్వరలో ఆటోలు అందిస్తామన్న మంత్రి DSBV స్వామి.. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలంలో సబ్సిడీ వలలు పంపిణీ
*దివంగత కాపు ఉద్యమ నేత వంగవీటి మోహన రంగా వర్ధంతి సందర్భంగా వైఎస్ జగన్ నివాళులు అర్పించారు. పేద ప్రజల సమస్యలను తన సమస్యలుగా భావించారని ట్వీట్
*వరుస సెలవులతో హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు ప్రయాణాలు.. విజయవాడ మార్గంలో ట్రాఫిక్ జామ్

News December 26, 2025

మరోసారి చెలరేగిన విరాట్ కోహ్లీ

image

విజయ్ హజారే ట్రోఫీలో విరాట్ కోహ్లీ మరోసారి తన క్లాస్‌ను చూపించారు. బెంగళూరు వేదికగా గుజరాత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ తరఫున ఆడుతున్న కోహ్లీ 61 బంతుల్లో 77 పరుగులు (13 ఫోర్లు, 1 సిక్స్) చేసి ఔటయ్యారు. అంతకుముందు కేవలం 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నారు. గత 6 లిస్ట్-A మ్యాచ్‌ల్లో వరుసగా 74*, 135, 102, 65*, 131, 77 పరుగులతో విరాట్ అదరగొట్టారు.