News December 3, 2024

తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు: అల్లు అర్జున్

image

‘పుష్ప-2’ టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతించడంపై తెలంగాణ ప్రభుత్వానికి హీరో అల్లు అర్జున్ ధన్యవాదాలు తెలిపారు. ఈ నిర్ణయం తెలుగు సినిమా ఎదుగుదలను ప్రోత్సహిస్తుందని ఆయన పేర్కొన్నారు. తెలుగు సినిమా, ఇండస్ట్రీకి సపోర్ట్‌గా నిలుస్తోన్న సీఎం రేవంత్‌కు, సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు’ అని ట్వీట్ చేశారు.

Similar News

News February 7, 2026

SRPT: మేడారంలో మైనర్ల లవ్ మ్యారేజ్.. సూసైడ్ అటెంప్ట్

image

ఖమ్మంలో చదువుకుంటున్న మైనర్ జంట ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఖమ్మం రఘునాథపాలెం మండలానికి చెందిన బాలిక, SRPT(D) ఆత్మకూరుకు చెందిన బాలుడు ఖమ్మంలో ఇంటర్ చదువుతూ ప్రేమలో పడ్డారు. పెద్దలు నిరాకరించడంతో మేడారంలో వివాహం చేసుకున్నారు. మేజర్లు అయ్యేవరకు ఆగాలని కుటుంబీకులు మందలించడంతో మనస్తాపం చెంది ఉరివేసుకున్నారు. ఈ ఘటనలో బాలుడు మృతి చెందగా, బాలిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

News February 7, 2026

చిన్నపిల్లలకు సోషల్ మీడియా బంద్.. త్వరలోనే నిర్ణయం!

image

చిన్న పిల్లలను SM నుంచి దూరంగా ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. వయసు ఆధారంగా ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌ల వినియోగానికి అనుమతులపై సీరియస్‌గా ఆలోచిస్తున్నట్లు కేంద్ర ఐటీ కార్యదర్శి ఎస్‌ కృష్ణన్‌ తెలిపారు. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఇటీవల ఆర్థిక సర్వే చేసిన సూచనలన్నింటినీ సమగ్రంగా పరిశీలిస్తున్నామని చెప్పారు. ఢిల్లీలో జరిగిన ICANN సదస్సులో ఆయన మాట్లాడారు.

News February 7, 2026

ఇండియా-US డీల్.. చైనాకు లాభం!

image

ఇండియా, అమెరికా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందంతో పరోక్షంగా చైనా లాభపడుతోంది. US ఆంక్షల నేపథ్యంలో రష్యా క్రూడాయిల్ కొనుగోళ్లను భారత్ తగ్గించింది. దీంతో చైనా వైపు రష్యా మొగ్గుచూపింది. ఒక్కో బ్యారెల్‌పై 12 డాలర్ల డిస్కౌంట్‌ను ఆఫర్ చేసింది. ఇప్పటికే రష్యా చమురులో చైనా 47% వరకు కొంటుండటం గమనార్హం. మరోవైపు 2024 డిసెంబర్‌తో పోలిస్తే గతేడాది డిసెంబర్‌లో ఇండియాకు రష్యన్ ఆయిల్ దిగుమతులు 27.5% తగ్గిపోయాయి.