News December 3, 2024

Delhi Elections: ఆప్‌తో జట్టుకట్టిన I-PAC

image

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పనిచేయడానికి ఆప్, పొలిటికల్ కన్సల్టెన్సీ I-PAC మధ్య ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. 2020 ఎన్నిక‌ల్లో ఆప్‌తో క‌లిసి ఐప్యాక్ ప‌నిచేసింది. అప్పుడు 70 స్థానాల్లో 62 చోట్ల ఘన విజ‌యాన్ని అందుకుంది. ఢిల్లీని ఆప్ పదేళ్లుగా పాలిస్తోంది. దీంతో ప్రభుత్వంపై వ్యతిరేకత, అవినీతి ఆరోపణలు అధికమయ్యాయి. వీటిని అధిగమించి కేజ్రీవాల్ సెంట్రిక్‌గా ఐప్యాక్ ప్రచారం ఉంటుందని తెలుస్తోంది.

Similar News

News November 11, 2025

ఏపీ టుడే

image

* జిల్లా కేంద్రాల్లో మైనారిటీ సంక్షేమ దినోత్సవం.. విజయవాడలో రాష్ట్ర స్థాయి వేడుకలకు హాజరు కానున్న సీఎం చంద్రబాబు
* ప్రకాశం జిల్లా పీసీపల్లిలో 50 MSME పార్కులు వర్చువల్‌గా ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు
* ఇవాళ బాపట్ల, కోనసీమ జిల్లాల్లో పర్యటించనున్న కేంద్ర బృందం. మొంథా తుఫానుతో పంట నష్టం పరిశీలన
* శ్రీకాకుళంలోని ఎన్టీఆర్ మైదానంలో ‘సిక్కోలు పుస్తక మహోత్సవం’.. ఈ నెల 20 వరకు నిర్వహణ

News November 11, 2025

మంగళవారం రోజున ఇలా చేయకపోవడం ఉత్తమం

image

మంగళవారం హనుమంతుడికి ఎంతో ప్రీతిపాత్రమైనది. ఈరోజు మద్యం, మాంసాహారం, మత్తు పదార్థాలు సేవించకపోవడం ఉత్తమమని పండితులు చెబుతున్నారు. మంగళ దోషం తొలగిపోయే ఈరోజున బిచ్చగాళ్లు, పేదలు, వికలాంగులు, వృద్ధులను అవమానించకూడదని అంటున్నారు. ‘తల్లి, సోదరి, భార్య సహా స్త్రీలను దైవస్వరూపంగా భావించాలి. శివుడిని గౌరవించాలి. శివపూజలు చేయాలి. ఈ నియమాలు పాటిస్తే ఆంజనేయుడు తప్పక అనుగ్రహిస్తాడు’ అని సూచిస్తున్నారు.

News November 11, 2025

ఢిల్లీ పేలుడు వెనుక ఉగ్ర కుట్ర!

image

ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో <<18253113>>పేలుడు<<>>పై కొత్వాలి పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఉగ్రదాడిగా అనుమానిస్తూ ఉపా చట్టం సెక్షన్ 16, 18 కింద రిజిస్టర్ చేసినట్లు వెల్లడించారు. మరోవైపు పేలుడు నేపథ్యంలో పలు దేశాల ఎంబసీలు అప్రమత్తమయ్యాయి. ఎర్రకోట పరిసరాల్లో ఉండొద్దని తమ దేశ పౌరులకు భారత్‌లోని యూఎస్, ఫ్రాన్స్ ఎంబసీలు అడ్వైజరీ జారీ చేశాయి.