News December 3, 2024

మార్కెట్ల‌లో వ‌రుస లాభాల‌కు కార‌ణం ఇదే!

image

దేశీయ స్టాక్ మార్కెట్లు గ‌త మూడు సెష‌న్ల‌లో వ‌రుస‌గా లాభాల‌ను అర్జించాయి. ఎఫ్ఐఐలు త‌మ డిజిన్వెస్ట్‌మెంట్‌కు బ్రేక్ ఇవ్వ‌డంతో సూచీలు మంగ‌ళ‌వారం దూసుకుపోయాయి. ఎఫ్ఐఐలు రూ.3,664 కోట్ల విలువైన షేర్ల‌ను కొనుగోలు చేయ‌డం సెంటిమెంట్‌ను బ‌ల‌ప‌రిచిన‌ట్టైంది. అదే స‌మ‌యంలో డీఐఐలు రూ.250 కోట్ల విలువైన షేర్ల‌ను అమ్మేశారు. అధిక వెయిటేజీ రంగాల‌కు ల‌భించిన కొనుగోళ్ల మ‌ద్ద‌తు లాభాల‌కు కార‌ణంగా తెలుస్తోంది.

Similar News

News December 31, 2025

మందుబాబులకు ఫ్రీ రైడ్.. ఈ నంబర్‌కు కాల్ చేయండి

image

TG: న్యూఇయర్ వేళ మందు బాబుల కోసం తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫాం వర్కర్స్ యూనియన్(టీజీపీడబ్ల్యూయూ) ఉచిత రైడ్ సేవలు ఇవ్వనున్నట్లు తెలిపింది. మద్యం తాగి వాహనం నడపలేని స్థితిలో ఉన్నవారికి ఈ సర్వీస్ అందిస్తామని తెలిపింది. HYD, సైబరాబాద్, రాచకొండ పరిధిలో ఇవాళ రాత్రి 11 గంటల నుంచి జనవరి 1 అర్ధరాత్రి ఒంటిగంట వరకు సేవలు ఉంటాయని పేర్కొంది. 8977009804 నంబర్‌కు కాల్ చేసి ఈ సర్వీసులు పొందవచ్చని వెల్లడించింది.

News December 31, 2025

‘సెరమా’.. కోడి చిన్నదైనా ధరలో తగ్గేదే లే..

image

ఈ సెరమా జాతి కోళ్లు మలేషియాలో కనిపిస్తాయి. ఇవి ఆకారంలో చిన్నవిగా, తక్కువ బరువు ఉంటాయి. వీటి శరీర ఆకృతి కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇవి నిటారుగా నిలబడి, ఛాతిని ముందుకు ఉంచి, తోకను పైకి పెట్టి గంభీరంగా కనిపిస్తాయి. ఇవి మనుషులతో త్వరగా కలిసిపోతాయి. వీటిని చాలామంది పెంపుడు పక్షులుగా పెంచుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. అందుకే వీటి ధర కేజీ సుమారు రూ.85 వేలుగా ఉంటుంది.

News December 31, 2025

నిమ్మకాయ దీపాన్ని ఎక్కడ వెలిగించాలి?

image

నిమ్మకాయ దీపాలను గ్రామ దేవతలైన మైసమ్మ, ఎల్లమ్మ, పోచమ్మ, మారెమ్మ, పెద్దమ్మ వంటి శక్తి స్వరూపిణుల ఆలయాలలో మాత్రమే వెలిగించాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ మహాలక్ష్మి, సరస్వతి వంటి శాంతమూర్తుల సన్నిధిలో, ఇతర దేవాలయాల్లో ఈ దీపాలను వెలిగించకూడదు. ఇంట్లోని పూజా గదిలో కూడా వీటిని నిషిద్ధంగా భావిస్తారు. కేవలం ఉగ్రరూపం కలిగిన దేవతా మూర్తుల వద్ద మాత్రమే నియమబద్ధంగా వెలిగించడం వల్ల ఆ తల్లి అనుగ్రహం లభిస్తుంది.