News December 3, 2024

సౌత్ కొరియాలో సైనిక పాలన

image

దేశంలో సైనిక అత్యవసర పరిస్థితి (సైనిక పాలన) విధిస్తున్నట్లు దక్షిణ కొరియా అధ్యక్షుడు యాన్ సుక్ యోల్ ప్రకటించారు. ఉత్తర కొరియా దాడుల భయంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా దేశంలోని ప్రతిపక్షాలు ఉత్తర కొరియాకు అనుకూలంగా ఉన్నాయని యోల్ ఆరోపిస్తున్నారు. దేశ అంతర్గత, బహిరంగ ప్రత్యర్థులను ఎదుర్కొనేందుకు మరో మార్గం లేక ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అయితే చీఫ్ నిర్ణయాన్ని విపక్షాలు తప్పుబడుతున్నాయి.

Similar News

News March 16, 2026

పాక్‌కు షాకిచ్చిన బంగ్లాదేశ్.. సిరీస్ కైవసం!

image

పాకిస్థాన్‌తో జరిగిన మూడో వన్డేలో 11 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ గెలిచింది. 290 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 279 పరుగులకు పాక్ ఆలౌట్ అయింది. సల్మాన్ అఘా(106) సెంచరీ చేసినా జట్టును గెలిపించలేకపోయారు. బంగ్లా బౌలర్లలో టస్కిన్ అహ్మద్ 4, నహిద్ రాణా 2, ముస్తాఫిజుర్ రహ్మాన్ 3, హొస్సేన్ 1 వికెట్ తీశారు. దీంతో 3 వన్డేల సిరీస్‌ను 2-1తో బంగ్లాదేశ్ కైవసం చేసుకుంది.

News March 16, 2026

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

News March 16, 2026

‘ఆపరేషన్ లోట‌స్‌’కు BJP తెరలేపింది: DK శివకుమార్

image

రాజ్యసభ ఎన్నికలను ప్రభావితం చేసేందుకు కొంత మంది ప్రయత్నిస్తున్నారని కర్ణాటక Dy.CM డీకే శివకుమార్ ఆరోపించారు. ఒడిశా కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి రూ.5 కోట్ల చొప్పున ఇచ్చేందుకు సిద్ధమయ్యారని విమర్శించారు. ఇది బీజేపీ ఆపరేషన్ లోటస్‌లో భాగమన్నారు. క్రాస్ ఓటింగ్ చేయాలని నలుగురు వ్యక్తులు తమ ఎమ్మెల్యేలను కాంటాక్ట్ చేశారని చెప్పారు. ఈ వ్యవహారంలో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.