News December 3, 2024
బట్టతలోడా అని తిట్టడం లైంగిక వేధింపే: UK కోర్టు

తలమీద వెంట్రుకలు లేని వ్యక్తిని బట్టతలోడా అని తిట్టడం లైంగిక వేధింపుల కిందికి వస్తుందని UK కోర్టు ఇటీవల తీర్పు ఇచ్చింది. ఈ తరహా వ్యాఖ్యలు మహిళల బ్రెస్ట్ గురించి వ్యాఖ్యానించడంతో సమానమని పేర్కొంది. బ్రిటిష్ బంగ్ అనే సంస్థలో పనిచేస్తున్న టోనీ ఫిన్‌ను సూపర్వైజర్ జేమీ కింగ్ ఓ సందర్భంలో బట్టతలోడా అంటూ బూతులు తిట్టారు. ఫిన్ కోర్టును ఆశ్రయించగా ఈ మేరకు తీర్పు వెలువరించింది.
Similar News
News January 13, 2026
వైద్య శాఖకు ₹567 కోట్ల కేంద్ర నిధులు: మంత్రి

AP: రాష్ట్ర వైద్య శాఖకు కేంద్రం ₹567 కోట్లు విడుదల చేసిందని మంత్రి సత్యకుమార్ తెలిపారు. 15వ ఆర్థిక సంఘం కింద ఇచ్చే ₹2600 కోట్లలో ఇవి చివరి విడత నిధులన్నారు. PHC భవనాలు, డయాగ్నొస్టిక్ పరికరాలు, ఇతర అభివృద్ధి పనులకు వీటిని వినియోగిస్తారు. కాగా FY25-26 నిధులు, ఖర్చుపై మంత్రి సమీక్షించారు. కేంద్ర నిధులను పూర్తిగా సాధించాలని అధికారులను ఆదేశించారు. విఫలమైతే సంబంధిత అధికారులే బాధ్యులని స్పష్టం చేశారు.
News January 13, 2026
విజయ్‌కు మరోసారి CBI నోటీసులు

కరూర్ తొక్కిసలాట ఘటనలో TVK పార్టీ అధినేత విజయ్‌కు <<18836427>>సీబీఐ<<>> మరోసారి నోటీసులు ఇచ్చింది. ఈనెల 19న విచారణకు రావాలని ఆదేశించింది. కాగా నిన్న విజయ్ను సీబీఐ 7 గంటల పాటు ప్రశ్నించింది. గతేడాది జరిగిన ఆ తొక్కిసలాటలో 41 మంది మరణించగా, 60 మందికి పైగా గాయాలయ్యాయి.
News January 13, 2026
భోగి మీ కుటుంబానికి కొత్త వెలుగులు తేవాలి: CM

AP: తెలుగు ప్రజలకు CM చంద్రబాబు భోగి శుభాకాంక్షలు తెలిపారు. ‘సంక్రాంతి ముగ్గులతో అలరారుతున్న తెలుగు లోగిళ్లలో భోగి జరుపుకుంటున్న ప్రజలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. భోగి మంటలు మీకు, మీ కుటుంబానికి కొత్త వెలుగులు తేవాలని ఆకాంక్షిస్తున్నా. ఆశావహ దృక్పథంతో సాగే మీ ఆలోచనలు సాకారం కావాలని.. అందుకు అండగా ఉంటానని తెలియజేస్తున్నా. మీ జీవితం భోగభాగ్యాలతో తులతూగాలని కోరుకుంటున్నా’ అని ట్వీట్ చేశారు.


