News December 3, 2024
EXCLUSIVE: ఇంటర్ విద్యార్థులకు GOOD NEWS

AP: ప్రభుత్వ ఇంటర్ కాలేజీల్లోనూ మధ్యాహ్న భోజనం అందించాలని విద్యాశాఖ మంత్రి లోకేశ్ నిర్ణయించారు. టెన్త్ తర్వాత డ్రాపౌట్స్ పెరుగుతుండటంతో భోజన సౌకర్యంతో ఈ సంఖ్య తగ్గించవచ్చని అధికారులతో సమీక్షలో పేర్కొన్నారు. అటు విద్యార్థుల్లో నైతిక విలువలను పెంపొందించే పాఠ్యాంశాల కోసం చాగంటి కోటేశ్వరరావు సలహాలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. AP, TGలో ప్రస్తుతం ప్రభుత్వ స్కూళ్లలో మాత్రమే మిడ్ డే మీల్ ఉంది.
Similar News
News September 13, 2025
తిరుమల: భక్తులతో నిండిపోయిన కంపార్టుమెంట్లు

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. కంపార్టుమెంట్లన్నీ భక్తులతో నిండిపోయి కృష్ణ తేజ గెస్ట్ హౌస్ నుంచి క్యూలైన్ కొనసాగుతోంది. టోకెన్లు లేనివారికి వేంకటేశ్వరుడి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.18కోట్లు వచ్చినట్లు TTD వెల్లడించింది. 69,842 మంది స్వామివారిని దర్శించుకోగా.. 28,234 మంది తలనీలాలు సమర్పించారు.
News September 13, 2025
మహిళా సంఘాలకు రివాల్వింగ్ ఫండ్ విడుదల

TG: 4,079 మహిళా సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.6.11 కోట్ల రివాల్వింగ్ ఫండ్ రిలీజ్ చేసింది. ఒక్కో సంఘానికి రూ.15,000 కేటాయించనుంది. ఈ నిధుల వినియోగాన్ని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులు, జిల్లా, మండల, గ్రామ సమాఖ్యలు పర్యవేక్షిస్తాయి. అత్యధికంగా మహబూబాబాద్ జిల్లాలో 397 సంఘాలకు, అత్యల్పంగా మంచిర్యాల జిల్లాలో 3 సంఘాలకు నిధులు అందనున్నట్లు సమాచారం.
News September 13, 2025
ఆమిర్ ఖాన్ తనయుడి సినిమాలో సాయిపల్లవి

సౌత్ హీరోయిన్ సాయిపల్లవి బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్‌తో ఓ సినిమా చేస్తున్నారు. సునీల్ పాండే డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీకి తొలుత ‘ఏక్ దిన్’ అనే టైటిల్‌ను అనుకున్నారు. తాజాగా దానిని ‘మేరే రహో’గా మార్చారు. ఈ మూవీని నవంబర్ 7న రిలీజ్ చేయాల్సి ఉండగా డిసెంబర్ 12కు వాయిదా వేశారు. ఇది సాయిపల్లవికి హిందీలో డెబ్యూ మూవీ కానుంది. ఆమె రణ్‌బీర్ ‘రామాయణ’ మూవీలోనూ నటిస్తున్నారు.