News December 3, 2024
PV సింధుకు కాబోయే భర్త గురించి తెలుసా?
PV సింధుకు కాబోయే <<14775039>>భర్త<<>> వెంకట దత్తసాయి పొసిడెక్స్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నారు. మాజీ IRS ఆఫీసర్ అయిన ఈయన తండ్రి GT వెంకటేశ్వరరావు MDగా వ్యవహరిస్తున్నారు. సాయి డిప్లొమా, ఫ్లేమ్ వర్సిటీలో BBA చదివారు. IIITలో డేటా సైన్స్, మెషీన్ లెర్నింగ్ పూర్తి చేశారు. JSW గ్రూపులో కన్సల్టెంట్‌గా పని చేశారు. IPLలో DCతోనూ కలిసి పనిచేసినట్లు సమాచారం. దత్తసాయి ఆస్తి సుమారు రూ.50కోట్లు ఉంటుందని అంచనా.
Similar News
News February 5, 2025
పార్కులలోని పనులు వెంటనే పూర్తి చేయాలి: కమిషనర్
పార్కుల్లో పెండింగ్‌లో ఉన్న పనులు వెంటనే పూర్తి చేయాలని బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే అధికారులను ఆదేశించారు. బల్దియా ప్రధాన కార్యాలయంలో హార్టికల్చర్ ఇంజినీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. నగరవ్యాప్తంగా ఉన్న వివిధ పార్కులలో దెబ్బతిన్న జిమ్ పరికరాలు, పిల్లలు ఆడుకునే ఆట వస్తువులను, మరమ్మతులు, దెబ్బతిన లైటింగ్ పునరుద్దించాలని అధికారులను ఆదేశించారు.
News February 5, 2025
ఢిల్లీ బీజేపీదే.. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్
ఢిల్లీలో బీజేపీ అధికారం చేపట్టనుందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. చాణక్య స్ట్రాటజీస్ ప్రకారం బీజేపీకి 39-44, పీపుల్ పల్స్ 51-60, మ్యాట్రిజ్ 35-40, పీపుల్స్ ఇన్ సైట్ 40-44, రిపబ్లిక్ పీ మార్క్ 39-49, పోల్ డైరి 42-50, జేవీసీ పోల్ 39-45 సీట్లు వస్తాయని పేర్కొన్నాయి. కాగా కేకే సర్వే మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీకి 39, బీజేపీకి 22 సీట్లు వస్తాయని అంచనా వేసింది.
News February 5, 2025
ఢిల్లీలో కమలానికే పీఠం: చాణక్య స్ట్రాటజీస్
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో BJPదే విజయమని చాణక్య స్ట్రాటజీస్ తెలిపింది. బీజేపీకి 39-44 సీట్లు వస్తాయని పేర్కొంది. ఆప్ 25-28 స్థానాలు దక్కించుకుంటుందని అంచనా వేసింది. కాంగ్రెస్‌కు 2-3 సీట్లు వచ్చే ఆస్కారముందని తెలిపింది. అలాగే పీపుల్స్ పల్స్ సర్వే బీజేపీ 51-60 సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేసింది. ఆప్ 10-19 స్థానాలకే పరిమితమవుతుందని పేర్కొంది. కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా రాదని తెలిపింది.