News December 4, 2024
భార్య కోసమే సైనిక పాలన..?

అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న భార్య కిమ్ కియోన్-హీ రక్షించడానికే దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సైనిక పాలన విధించినట్టు తెలుస్తోంది. కిమ్‌పై దర్యాప్తునకు విపక్ష డెమోక్రటిక్ పార్టీ(DP) ప్రయత్నిస్తోంది. మరోవైపు అధికార పార్టీ తెచ్చిన బడ్జెట్‌ను DP తిరస్కరించింది. నేషనల్ అసెంబ్లీలో మెజారిటీ ఉన్న DP నిర్ణయాన్ని అధ్యక్షుడు రద్దు చేయలేరు. ఈ పరిణామాల నేపథ్యంలో యూన్ సైనిక పాలన విధించారు.
Similar News
News March 13, 2026
యుద్ధం.. ఐదుగురు భారతీయులు మృతి

ఒమన్‌లోని సోహార్ పారిశ్రామిక ప్రాంతంలో కూల్చివేసిన డ్రోన్ శకలాలు పడటంతో ఇద్దరు భారతీయులు మృతిచెందినట్లు విదేశాంగ శాఖ ధ్రువీకరించింది. ఈ ఘటనలో మరో 10 మంది భారతీయులు గాయపడ్డారు. మరోవైపు హార్ముజ్‌లో చిక్కుకుపోయిన నౌకల్లో ఉన్న భారత నావికుల్లో ముగ్గురు చనిపోయినట్లు కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఈ యుద్ధంలో ఇప్పటి వరకు ఐదుగురు ఇండియన్స్ ప్రాణాలు విడిచినట్లు అయ్యింది.
News March 13, 2026
టీచర్ ప్రతిరోజు భోజనం నాణ్యత చెక్ చేయాలి: మంత్రి లోకేశ్

AP: మైలవరంలో విద్యార్థులకు నాసిరకం భోజనం <<19370398>>పెట్టడంపై<<>> విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రతిరోజూ ఒక టీచర్ భోజనం నాణ్యత పరిశీలించాలని ఆదేశించారు. MLAలు వారానికి ఒక స్కూలును సందర్శించాలని విద్యార్థులతో కలిసి భోజనం చేయాలని సూచించారు. డొక్కా సీతమ్మ పేరుపై నడుస్తున్న భోజన పథకంపై కుట్రలు చేసినా, నాణ్యత తగ్గినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
News March 13, 2026
భారత్‌కు బయల్దేరిన LPG ట్యాంకర్?

హార్ముజ్‌పై ఇరాన్ ఆంక్షలు కొనసాగుతున్నా భారత్‌కు వస్తున్న భారీ LPG ట్యాంకర్ జలసంధిని దాటినట్లు సమాచారం. భారత్‌లో గ్యాస్ కొరతపై ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ వార్త ప్రాధాన్యం సంతరించుకుంది. ఇరాన్‌తో భారత్ పలు దఫాలు చర్చలు జరిపిన తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది. మరోవైపు భారత్-ఇరాన్ మిత్రదేశాలని, హార్ముజ్ ద్వారా భారత నౌకలు వెళ్లేందుకు అనుమతిస్తున్నామని ఢిల్లీలోని ఆ దేశ అంబాసిడర్ తెలిపారు.


