News December 4, 2024

వీరంతా దివ్యాంగులే.. కానీ సాధించారు! (2/2)

image

సూర్‌దాస్: 16వ శతాబ్దానికి చెందిన సూర్‌దాస్‌కు కళ్లు కనిపించేవి కాదు. అయినా క‌ృష్ణుడి కోసం వేలాది కవితల్ని రాశారు.
రూజ్‌వెల్ట్: పోలియోతో నడుం కింది భాగం చచ్చుబడిపోయినా పట్టుదలతో అమెరికాకు 4సార్లు అధ్యక్షుడిగా పనిచేశారు.
ఫ్రీడా కాహ్లో: మెక్సికోకు చెందిన ఫ్రీడా కాహ్లో పోలియో, బస్సు ప్రమాదం కారణంగా దివ్యాంగురాలయ్యారు. అయినప్పటికీ తనను తాను దిగ్గజ పెయింటర్‌గా తీర్చిదిద్దుకున్నారు.

Similar News

News March 24, 2026

యువతా.. దేశ రాజకీయం మార్చేందుకు సిద్ధమా?

image

రాజకీయాలపై ఆసక్తి ఉన్న యువత, మహిళలకు గోల్డెన్ ఛాన్స్. నియోజకవర్గాల పునర్విభజనతో దేశవ్యాప్తంగా లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలు <<19460921>>భారీగా<<>> పెరగనున్నాయి. దీంతో విస్తృత అవకాశాలు రానున్నాయి. దేశ దిశను మార్చాలనే సంకల్పం ఉన్నవారు ప్రజాక్షేత్రంలోకి దిగండి. కొత్త ఆలోచనలు, సరికొత్త భావజాలాలను ప్రజలకు పరిచయం చేసి వారి మెప్పు పొందండి. ‘నేపాల్‌’ను గెలిచిన Gen Z స్ఫూర్తితో ముందుకు కదలండి.

News March 24, 2026

విజయవాడలో ఉగ్రమూలాలు.. ముగ్గురు అరెస్ట్

image

AP: ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలతో విజయవాడలో ముగ్గురు వ్యక్తులు పట్టుబడ్డారు. మొహ్మద్‌ రహమతుల్లా షరీఫ్, మీర్జా సొహైల్‌ బేగ్, మొహ్మద్‌ డానిష్‌ అనే ఈ నిందితులు సోషల్ మీడియా ద్వారా యువతను తీవ్రవాద భావజాలంవైపు ఆకర్షిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వీరితో పాటు పది మంది దేశవ్యాప్తంగా ఈ నెట్‌వర్క్‌ నడిపిస్తున్నారని.. వీరికి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

News March 24, 2026

మతం మారిన వెంటనే ఎస్సీ హోదా రద్దు: సుప్రీంకోర్టు

image

క్రైస్తవంలోకి మారిన వెంటనే ఎస్సీ హోదా రద్దవుతుందని సుప్రీంకోర్టు తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. మతం మారితే కుల సర్టిఫికెట్ రద్దు కాకపోయినా చట్టం వర్తించదని పేర్కొంది. సర్టిఫికెట్ ఉంది కాబట్టి రక్షణ కల్పించలేమంది. <<19463010>>పాస్టర్<<>> ఆనంద్ దశాబ్దానికి పైగా క్రైస్తవంలో ఉన్నారని, తిరిగి మారలేదని తెలిపింది. SC కమ్యూనిటీలోకి తిరిగి చేర్చుకున్నారని నిరూపించుకుంటేనే పాత హోదా పునరుద్ధరణ సాధ్యమని తేల్చి చెప్పింది.