News December 4, 2024
వీరంతా దివ్యాంగులే.. కానీ సాధించారు! (1/2)

లూయీ బ్రెయిలీ: అంధుడైన బ్రెయిలీ టీనేజర్‌గా ఉన్నప్పుడు బ్రెయిలీ లిపిని రూపొందించారు. నేడు కళ్లులేనివారు కూడా చదువుకునేందుకు ఉపకరిస్తోంది.
స్టీఫెన్ హాకింగ్: ALS వ్యాధి వలన 21వ ఏట నుంచి కుర్చీకే పరిమితమైన స్టీఫెన్ హాకింగ్, ప్రపంచం గర్వించే భౌతిక శాస్త్రవేత్త అయ్యారు.
హెలెన్ కెల్లర్: 19 నెలల వయసులో వ్యాధి కారణంగా మూగ, చెవిటిగా మారిన కెల్లర్ రికార్డు స్థాయిలో అమ్ముడుపోయిన పలు పుస్తకాల్ని రాశారు.
Similar News
News December 26, 2025
బోరాన్ స్ప్రేతో మామిడి పంటకు కలిగే లాభాలు

బోరాన్ పిచికారీ వల్ల పూత, పిందె రాలడం, పండ్లు పగలకుండా ఉండటమే కాకుండా.. ఇవి మామిడి పండ్లలో చక్కెర, విటమిన్ సి స్థాయిలను, గుజ్జు శాతాన్ని పెంచుతుంది. బోరాన్‌ను లేత పూత దశలో మరియు పిందెలు వృద్ధి చెందే దశలో పిచికారీ చేసే పురుగు మందులతో కలిపి స్ప్రే చేయవచ్చంటున్నారు వ్యవసాయ నిపుణులు. ఇలా చేయడం వల్ల రైతులకు సమయం, ఖర్చు ఆదా అవుతాయని చెబుతున్నారు. నిపుణుల సూచనలతో అవసరమైన మోతాదులో బోరాన్ పిచికారీ చేయాలి.
News December 26, 2025
శుక్రవారం లక్ష్మీదేవిని ఎందుకు పూజిస్తారు?

శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయని నమ్మకం. జ్యోతిషశాస్త్రం ప్రకారం.. శుక్ర గ్రహం లక్ష్మీదేవి అధీనంలో ఉంటుంది. అందుకే శుక్రుడు అనుకూలంగా ఉండే ఈ రోజున అమ్మవారిని పూజిస్తే.. ధనం, సౌభాగ్యం, కళాభివృద్ధి లభిస్తాయని నమ్ముతారు. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఈరోజున వ్రతాలు, తులసి పూజ, దానధర్మాలు చేయాలని పండితులు సూచిస్తున్నారు. శుక్రవారం వ్రతం వివరాల కోసం క్లిక్ <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>.
News December 26, 2025
ఓట్స్‌తో చర్మానికి గ్లో..

ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని చాలామంది ఓట్స్‌ను బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటారు. ఇవి కేవలం ఆరోగ్యంతో పాటు అందాన్ని పెంచడంలోనూ సహకరిస్తాయి. 3 స్పూన్ల పెరుగు, 2 స్పూన్ల ఓట్స్, నిమ్మరసం వేసి పేస్ట్ చేయాలి. దీన్ని చర్మానికి అప్లై చేసి 15 నిమిషాల తర్వాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేస్తే చర్మం కాంతివంతంగా ఉంటుంది. ఓట్స్‌లో ఉండే జింక్, ప్రోటీన్స్, విటమిన్-ఇ చర్మాన్ని తేమగా, మెరిసేలా చేస్తాయి.


