News December 4, 2024
అవినీతి నిరోధక పోస్టర్ విడుదల చేసిన కలెక్టర్

డిసెంబరు 3నుండి 9వరకు జరిగే అవినీతి నిరోధక వారోత్సవాలలో భాగంగా ఈరోజు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పోస్టర్‌లను విడుదల చేశారు. అన్ని ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థల్లో అవినీతి రహిత సమాజం ఆవశ్యకతను ఆమె నొక్కిచెప్పారు. రాష్ట్ర సీఎం కలలుగన్న బంగారు తెలంగాణకు అవినీతి రహిత సమాజం దారి చూపుతుందని ఉద్ఘాటించారు. ప్రజల దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరించాలన్నారు.
Similar News
News March 10, 2026
నల్గొండ: ప్రజావాణి ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి: కలెక్టర్

ప్రజావాణి ద్వారా వచ్చే ఫిర్యాదులను అధికారులు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఆదేశించారు. సోమవారం ఫిర్యాదుల స్వీకరణ అనంతరం అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ముఖ్యంగా ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్న శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని, బాధితులకు సకాలంలో న్యాయం జరిగేలా చూడాలని స్పష్టం చేశారు. నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

News March 9, 2026
నల్గొండ: మార్చి 10 నుంచి పశువులకు టీకాలు

నల్గొండ జిల్లాలో పశువులకు గాలికుంటు వ్యాధి (FMD) నివారణకు మార్చి 10 నుంచి ఏప్రిల్ 9 వరకు ప్రత్యేక టీకా కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా పశుసంవర్ధక అధికారి డాక్టర్ జి.వి. రమేష్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 3 లక్షల పశువులకు టీకాలు వేసేందుకు 80 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. గ్రామాల వారీగా జరిగే ఈ ఉచిత టీకా కార్యక్రమాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.