News December 4, 2024
ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు

జగిత్యాల జిల్లాలో సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి మంగళవారం రూ.1,54,486 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.98,703 ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.43,520, అన్నదానం రూ.12,263,వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ ప్రకటన ద్వారా ప్రజలకు తెలియజేశారు.
Similar News
News April 19, 2026
‘రాజీవ్ యువ వికాసం’ పథకానికి మోక్షం ఎప్పుడు..?

నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకగా చేపట్టిన ‘రాజీవ్ యువ వికాసం’ పథకం అమలులో జాప్యంపై అభ్యర్థులు ఆశతో ఉన్నారు. కరీంనగర్ జిల్లాలో రాయితీ రుణాల కోసం 55 వేలకు పైగా యువత ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్నారు. నెలలు గడుస్తున్నా యూనిట్లు మంజూరు కాకపోవడంతో నిరాశలో ఉన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రుణాల పంపిణీ చెయ్యాలని కోరుతున్నారు.
News April 19, 2026
‘కరీంనగర్ జిల్లాను రాష్ట్రానికి ఆదర్శంగా నిలపాలి’

ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సంక్షేమ వారాన్ని ప్రణాళిక ప్రకారం నిర్వహించాలని చిత్రా మిశ్రా అధికారులకు ఆదేశించారు. గురుకులాలు, హాస్టళ్లలో పారిశుధ్యం, వంటగది మరమ్మతులు, విద్యార్థులకు పోటీలు, తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించాలని సూచించారు. రైతుల రిజిస్ట్రీ 100% పూర్తి చేసి, కరీంనగర్ జిల్లాను రాష్ట్రానికి ఆదర్శంగా నిలపాలని పిలుపునిచ్చారు.
News April 19, 2026
జమ్మికుంట: జిల్లా పద్మశాలి మహిళా అధ్యక్షురాలిగా కందికట్ల పద్మ

తెలంగాణ రాష్ట్ర పద్మశాలి చేనేత ఐక్య వేదిక కరీంనగర్ జిల్లా పద్మశాలి సంఘం మహిళా విభాగ నూతన అధ్యక్షురాలిగా జమ్మికుంటకు చెందిన కందికట్ల పద్మను నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు రాపోలు వీర మోహన్ ఉత్తర్వులు జారీ చేశారు. పద్మ మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన సంఘ పెద్దలు, సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. పద్మశాలీల సంక్షేమం, ఐక్యత కోసం నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.


