News December 4, 2024
ప.గో: ‘ఇప్పటివరకు రూ.383 కోట్లు జమ చేశాం’

ప.గో జిల్లాలోని 248 రైతు సేవా కేంద్రాల ద్వారా 1 లక్ష 72 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి మంగళవారం తెలిపారు. జేసీ మాట్లాడుతూ.. కొనుగోళ్లకు సంబంధించి రూ.390 కోట్లు రైతులకు చెల్లించాల్సి ఉండగా.. ఇప్పటివరకు రూ.383 కోట్లు రైతులకు జమ చేయడం జరిగిందన్నారు. ధాన్యం సేకరణ వేగవంతం చేయాలని మండల స్థాయి అధికారులకు ఆదేశించారు.
Similar News
News March 18, 2026
భీమవరం: ‘దివ్యాంగ శక్తి’ పథకం ప్రారంభం

భీమవరం ఆర్టీసీ బస్టాండ్‌లో బుధవారం ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని కలెక్టర్ నాగరాణి, ఎమ్మెల్యే రామాంజనేయులు ప్రారంభించారు. 40 శాతానికి పైగా వైకల్యం ఉన్నవారు ఐదు రకాల ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు ఈ పథకం ఉపయోగపడుతుందని వారు వివరించారు. దివ్యాంగులకు సముచిత స్థానం కల్పించాలనే సదుద్దేశంతోనే ఈ ఉచిత ప్రయాణ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు వారు పేర్కొన్నారు.
News March 18, 2026
నరసాపురంలో వ్యక్తి మృతి.. ఇతనెవరో తెలుసా!

నరసాపురం రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫారమ్‌పై బుధవారం గుర్తు తెలియని ఓ వ్యక్తి (45) మృతి చెందారు. రైలు ఎక్కేందుకు వచ్చిన ఆయన అస్వస్థతతో అక్కడికక్కడే కన్నుమూశారు. మృతుని వివరాలు తెలియరాలేదు. ఆచూకీ తెలిసిన వారు భీమవరం జీఆర్‌పీ ఎస్సై సుబ్రహ్మణ్యంను 9908448729 నంబరులో సంప్రదించాలని పోలీసులు కోరారు. ప్రస్తుతం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.
News March 18, 2026
ప.గో: కుమారుడితో కలిసి టెన్త్ పరీక్షలు రాస్తున్న తల్లి

పాలకొల్లుకు చెందిన ముత్యాల అశ్విని (33) తన కుమారుడు విజయ్‌తో కలిసి పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్నారు. 2001లో ఆరో తరగతితోనే చదువు ఆపేసి చిన్న వయసులో వివాహం చేసుకున్న ఆమె.. ఇన్నాళ్లకు కుమారుల చొరవతో మళ్లీ పుస్తకం పట్టారు. చదువు విలువ తెలుసుకొని ప్రైవేటుగా పరీక్షలు రాస్తున్న ఈ తల్లి పట్టుదలను స్థానికులు అభినందిస్తున్నారు. వయసుతో సంబంధం లేకుండా చదువుకోవాలనే వారి ఆశయం అందరికీ స్ఫూర్తిగా నిలుస్తోంది.


