News December 4, 2024
MBNR: ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్

దివ్యాంగుల సంక్షేమ కోసం ప్రభుత్వం సంక్షేమ కార్య క్రమాలు అమలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. మంగళవారం అంబేడ్కర్ అడిటోరియంలో ప్రపంచ దివ్యాంగులదినోత్సవ వేడుకలను జ్యోతి ప్రజ్వలన చేసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆమె సమాన అవకాశాలు, గౌరవంగా జీవించేందుకు కేంద్ర ప్రభుత్వం దివ్యాంగుల హక్కుల చట్టం 2016 అమలు చేస్తున్నట్లు తెలిపారు.
Similar News
News April 2, 2026
MBNR: గుంపులుగా నాగుపాములు.. గ్రామంలో భయాందోళన

చిన్న చింతకుంట మండలం కురుమూర్తి గ్రామం రెండవ వార్డులో బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు సుమారు 35 నాగుపాములను స్థానికులు చంపారు. వార్డులో నివసిస్తున్న విశ్వనాధ్ ఇంటి పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటంతో పాములు సంచారిస్తున్నాయని కాలనీవాసులు తెలిపారు. ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా ఈ చర్య తీసుకున్నామని చెప్పారు. చంపబడిన వాటిలో చిన్న పాములు కూడా ఉండటం గమనార్హం.
News April 1, 2026
మహబూబ్ నగర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఆనందరావు

మహబూబ్ నగర్ బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా సీనియర్ న్యాయవాది ఆనందరావు బుధవారం బార్ అసోసియేషన్ అధ్యక్షులు బాధ్యతలను స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ.. తనకు తన సహచర న్యాయవాదులు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని వెల్లడించారు. న్యాయవాదుల ప్రతి సమస్యను దగ్గరుండి పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో మాజీ బార్ అసోసియేషన్ అధ్యక్షులు అనంతరెడ్డి పాల్గొన్నారు.
News April 1, 2026
హనుమాన్ జయంతి వేడుకల్లో మేయర్ మమత

మహబూబ్‌నగర్ కార్పొరేషన్ మేయర్ గుమ్మాల మమత బుధవారం కార్పొరేషన్ పరిధిలోని 3వ డివిజన్ అప్పన్నపల్లి ఆంజనేయస్వామి దేవాలయంలో నిర్వహించిన హనుమాన్ జయంతి వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా దేవాలయంలో ఆమె ప్రత్యేక పూజలు చేశారు. మేయర్ మాట్లాడుతూ.. జిల్లా ప్రజలను ఆంజనేయ స్వామి చల్లగా చూడాలని ఆయన ఆశీర్వచనం ప్రజలపై ఉండాలని కాంక్షించారు. కార్యక్రమంలో డివిజన్ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


