News December 4, 2024
ఉన్నతాధికారులతో నెల్లూరు కమిషనర్ భేటీ

నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో వివిధ అభివృద్ధి పనులను చేపట్టేందుకు మెట్రో నగరాల అధ్యయనంలో భాగంగా కమిషనర్ సూర్యతేజ హైదరాబాదులోని వివిధ విభాగాల ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. మంగళవారం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కూకట్ పల్లి జోనల్ కమిషనర్ అపూర్వ చౌహన్‌ను కమిషనర్ కలుసుకున్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థపై చర్చించారు.
Similar News
News March 27, 2026
నెల్లూరు జిల్లాలో ఆ బస్సులు చాలా డేంజర్..!

మార్కాపురం ప్రమాదంతో నెల్లూరుD) కలిగిరికి చెందిన <<19487686>>హరికృష్ణ <<>>ప్రైవేట్ ట్రావెల్స్ తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఇతర రాష్ట్రాలకు చెందిన డొక్కు బస్సులను తక్కువ ధరకు కొనుగోలు చేస్తారని సమాచారం. వాటిపై పాత ట్రావెల్స్ పేర్లు ఉండటమే ఇందుకు నిదర్శనం. ప్రయాణ సమయంలో తరచూ రిపేర్లకు గురవుతుంటాయని.. చాలాసార్లు మార్గమధ్యంలోనే బస్సులను మారుస్తుంటారని అందులో ప్రయాణించిన వాళ్లు చెబుతున్నారు.
News March 27, 2026
నెల్లూరు: ఘోర ప్రమాదం.. ఆరుగురు మృతి

మార్కాపురంలో ట్రావెల్స్ బస్సు, టిప్పర్ ఢీకొన్న ఘటనలో నెల్లూరు జిల్లాకు చెందిన ఆరుగురు చనిపోయారు.
➤ముత్తంగి వెంకటేశ్వర్లు(దాసరిపల్లి, ఉదయగిరి)
➤ఆత్మకూరు చిన్నయ్య(నాగసముద్రం, కలిగిరి)
➤కత్తి జయరాములు(మంగళకట్ట, బుచ్చి)
➤గుల్లపల్లి వెంకటేశ్వర్లు(నాయుడుపల్లి, దుత్తలూరు)
➤నర్సింగు ప్రభావతి, చైత్రి(తూర్పు యర్రబల్లి, కొండాపురం)
News March 27, 2026
నెల్లూరు జిల్లాకు జగన్ రాక

వైసీపీ అధినేత జగన్ నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. వచ్చే నెల మొదటి వారంలో ఆయన జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌ను పరిశీలించి మత్స్యకారులతో మాట్లాడాతరాని వైసీపీ నేతలు వెల్లడించారు. ఇందులో భాగంగా బోగోలు మండలం జువ్వలదిన్నె మార్గంలో బ్రిడ్జి వద్ద హెలిపాడ్ ఏర్పాట్లను మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గురువారం పరిశీలించారు.


