News December 4, 2024
డిసెంబర్ 04: చరిత్రలో ఈ రోజు

1829: సతీ సహగమన దురాచార నిషేధం
1910: మాజీ రాష్ట్రపతి ఆర్.వెంకట్రామన్ జననం
1919: మాజీ ప్రధాని ఐకే గుజ్రాల్ జననం
1922: సంగీత దర్శకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు జననం
1977: బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ జననం
1981: నటి రేణూ దేశాయ్ జననం
2021: ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కొణిజేటి రోశయ్య మరణం
భారత నౌకాదళ దినోత్సవం
Similar News
News March 23, 2026
ఒకే రోజు రూ.10,320 తగ్గిన 10గ్రాముల బంగారం ధర

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధర ఇవాళ <<19453496>>మరోసారి<<>> భారీగా పడిపోయింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.10,320 తగ్గి రూ.1,35,650కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.9,450 పతనమై రూ.1,24,350 పలుకుతోంది. అటు కేజీ సిల్వర్ రేటు రూ.2,30,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలుండొచ్చు.
News March 23, 2026
3లక్షల మందికి పైగా భారత్‌కు తిరిగొచ్చారు: PM మోదీ

పశ్చిమాసియాలో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు యుద్ధ ప్రభావిత దేశాల నుంచి 3 లక్షల మందికి పైగా భారత్‌కు తిరిగొచ్చారని ప్రధాని మోదీ వెల్లడించారు. ఇందులో ఇరాన్ నుంచి వచ్చిన వారు 1000 మంది ఉన్నట్లు లోక్‌సభలో పేర్కొన్నారు. ఈ యుద్ధం వల్ల భారత్ అనేక సవాళ్లు ఎదుర్కొంటోందని చెప్పారు. గల్ఫ్ దేశాల్లో కోటి మందికి పైగా భారతీయులు నివసిస్తున్నారని, వారి భద్రతకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
News March 23, 2026
అమరావతి అప్పులు భూములు అమ్మి తీరుస్తాం: నారాయణ

AP: రాజధాని అమరావతిపై వైసీపీ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మంత్రి నారాయణ మండిపడ్డారు. ‘అమరావతిని ప్రభుత్వం ఎలా పూర్తి చేయగలదనే భ్రమల్లో YCP నేతలున్నారు. రాజధానిలోని నిర్మాణాలు మామూలువి కాదు ఐకానిక్ భవనాలు. ప్రపంచంలోనే అత్యద్భుతమైన అసెంబ్లీ భవనాన్ని నిర్మిస్తున్నాం. అమరావతి నిర్మాణానికి అయ్యే అప్పుల్ని భూముల అమ్మకాల ద్వారా తీరుస్తాం’ అని మంత్రి వివరించారు.


