News December 4, 2024

15 ఏళ్ల తర్వాత విండీస్‌లో గెలిచిన బంగ్లాదేశ్

image

వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టులో బంగ్లాదేశ్ విజయం సాధించింది. 15 ఏళ్ల తర్వాత ఆ జట్టు విండీస్‌లో టెస్టు మ్యాచ్ గెలిచింది. 287 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన విండీస్ 185 పరుగులకే ఆలౌటైంది. దీంతో బంగ్లా 101 పరుగుల తేడాతో విజయం సాధించింది. కవెమ్ హాడ్జ్ (55) ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకుండా పోయింది. తైజుల్ ఇస్లాం 5 వికెట్లతో చెలరేగారు. తొలి టెస్టులో విండీస్ గెలవడంతో సిరీస్ 1-1తో సమమైంది.

Similar News

News March 20, 2026

గోదావరిలో విజయనగరం విద్యార్థి గల్లంతు

image

ఎటపాక మండలం పురుషోత్తపట్నం వద్ద గోదావరి నదిలో <<19432323>>గల్లంతైన<<>> ఐదుగురు యువకులు అమరావతిలోని ఎస్ఆర్ఎం కాలేజీలో ఇంజినీరింగ్ చదువుతున్నట్లు పోలీస్ అధికారులు చెబుతున్నారు. సతీశ్(మదనపల్లి), నవదీప్ (ఉయ్యూరు), తేజజ్ఞ(ఉయ్యూరు), శ్రీకర్(భద్రాచలం), అభిరామ్(విజయనగరం) అని తేల్చారు. వీరంతా బీటెక్ సెకండియర్ చదువుకుంటున్నారన్నారు. ఏడుగురు గోదావరిలో దిగగా ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారన్నారు.

News March 20, 2026

పెరిగిన ‘పవర్’ పెట్రోల్ ధర

image

దేశవ్యాప్తంగా ‘పవర్’ పెట్రోల్ ధర పెరిగింది. ప్రభుత్వ రంగ సంస్థలైన HPCL, BPCL, IOCL లీటర్‌పై రూ.2.09-రూ.2.35 వరకు వడ్డించాయి. ఈరోజు నుంచే ఈ ధరలు అమల్లోకి వచ్చాయి. నార్మల్ పెట్రోల్ రేట్‌లో ఎలాంటి మార్పు చేయలేదు. పశ్చిమాసియాలో యుద్ధం వల్ల క్రూడాయిల్ సరఫరా తగ్గడంతో రేట్లు సవరించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే వంటగ్యాస్ ధరలు పెరిగిన విషయం తెలిసిందే.

News March 20, 2026

గుడ్ న్యూస్: డెయిరీ, గొర్రెల ఫారాలకు ఛార్జీల రద్దు

image

AP: రాష్ట్రంలోని డెయిరీ, గొర్రెలు, మేకలు, పందుల పెంపకందారుల నుంచి వసూలు చేస్తున్న బెటర్‌మెంటు, డెవలప్మెంటు ఛార్జీలను ప్రభుత్వం రద్దు చేసింది. ఇక నుంచి వీటిని మినహాయిస్తున్నట్లు మున్సిపల్ శాఖ ఉత్తర్వులు జారీచేసింది. అలాగే వీటికి సంబంధించి మున్సిపాల్టీల పరిధిలోని బిల్డింగ్ పర్మిషన్, లైసెన్స్ ఫీజులను పంచాయతీలతో సమానం చేయనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు ఈ మినహాయింపులపై GO ఇచ్చారు.