News December 4, 2024

పాతపట్నం: ఆవును చంపిన పెద్దపులి

image

గత వారం రోజులుగా శ్రీకాకుళం జిల్లాలో పెద్దపులి సంచరిస్తున్న విషయం తెలిసిందే. పాతపట్నం మండలం తిమరా గ్రామ సమీపంలో ఒక ఆవుపై దాడి చేసి దాన్ని సమీప తోటల్లోకి లాక్కెళ్లి తినేసిన ఆనవాళ్లను మంగళవారం అటవీ శాఖ సిబ్బంది గుర్తించారు. అనంతరం రొంపివలస మీదుగా కొరసవాడ గ్రామం వైపు పెద్దపులి వెళ్లినట్లు అడుగుజాడలు గుర్తించారు. స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పాతపట్నం అటవీశాఖ రేంజ్ అధికారి అమ్మన్నాయుడు తెలిపారు.

Similar News

News March 10, 2026

శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్‌పై ACB అదికారుల దాడి

image

శ్రీకాకుళం నగరపాలక సంస్థ కార్యాలయంలో ACB అధికారులు మంగళవారం సోదాలు నిర్వహించారు. ACB సర్కిల్ ఇన్‌స్పెక్టర్ భాస్కర్ రావుతో కూడిన బృందం ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. ప్రధానంగా టౌన్ ప్లానింగ్ సంబంధించిన ఫైళ్లను, ఈ ఆఫీస్ ఫైళ్లను పరిశీలించారు. టౌన్ ప్లానింగ్ శాఖలో అవినీతి ఆరోపణలు పెరిగిన నేపథ్యంలో ఏసీ శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఫిర్యాదుల మేరకు సోదాలు నిర్వహిస్తున్నారు.

News March 10, 2026

SKLM: ‘ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించాలి’

image

ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించాలని శ్రీకాకుళం జిల్లా అదనపు ఎస్పీ కెవి రమణ అన్నారు. శ్రీకాకుళం రూరల్ మండలం తండేవలసలో ఉన్న పోలీస్ శిక్షణకేంద్రంలో ఆర్మడు రిజర్వుడ్ పోలీసులకు 14 రోజులుపాటు నిర్వహించనున్న శిక్షణ కార్యక్రమంలో మంగళవారం పాల్గొన్నారు. వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకుని వ్యక్తిగత క్రమశిక్షణ పాటిస్తూ జిల్లా పోలీసుశాఖ ప్రతిష్ఠను పెంచాలన్నారు. సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించుకోవాలన్నారు.

News March 10, 2026

శ్రీకాకుళం: సామాన్యులపైన యుద్ధం ప్రభావం!

image

ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ధం ప్రభావం శ్రీకాకుళం జిల్లా ప్రజలపైన పడుతుంది. ప్రభుత్వం ఒకేసారి వంట గ్యాస్ సిలిండర్‌పై రూ.60, వాణిజ్య సిలిండర్‌పై రూ.100 పెంచారు. జిల్లాలో 6,95,278 కనెక్షన్లు ఉన్నాయని జిల్లా పౌరసరపరా శాఖ జి.సూర్యప్రకాశ్ తెలిపారు. ప్రస్తుతం వంట గ్యాస్ ధర జిల్లాలో రూ.879.50, వాణిజ్య గ్యాస్ ధర రూ.939.50 ఉంది. మరోపక్క గ్యాస్ డెలివరీ సమయం 25 రోజులకు పెంచారు.