News December 4, 2024
అనంతపురం జిల్లాలో రానున్న 5 రోజులు వర్షం

అనంతపురం జిల్లాలో బుధవారం నుంచి ఆదివారం వరకు వర్షాలు పడే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు జిల్లాలోని రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గాలిలో తేమ శాతం ఉదయం 83.9% నుంచి 95.1% వరకు ఉండొచ్చని చెప్పారు. అలాగే మధ్యాహ్నం 59.9% నుంచి 68.1% వరకు ఉండొచ్చని అంచనా వేసినట్లు తెలిపారు.
Similar News
News March 15, 2026
చదువుకోవడం ఇష్టం లేక సూసైడ్

పెద్దవడుగూరు మండలం విరుపాపురంలో యువకుడు కళ్యాణ్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 3 ఏళ్ల క్రితం ఇంటర్ ఫస్టియర్‌లో కొన్ని సబ్జెక్ట్స్ ఫెయిల్ కావడంతో ప్రస్తుతం ఇంటి వద్ద ఖాళీగా ఉన్నాడు. సప్లమెంటరీ రాసుకొమ్మని కుటుంబసభ్యులు చెప్పారు. కళ్యాణ్‌కు చదువుకోవడం ఇష్టం లేక మామిడి తోటలో చెట్టుకు ఉరివేసుకొన్నాడు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు.
News March 14, 2026
పదో తరగతి పరీక్షలకు పటిష్ఠమైన బందోబస్తు: ఎస్పీ

పదో తరగతి పరీక్షలు సజావుగా జరిగేలా పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని అనంతపురం ఎస్పీ జగదీశ్ పోలీస్ అధికారులను ఆదేశించారు. ఈనెల 16వ తేదీ నుంచి ఏప్రిల్ ఒకటో తేదీ వరకు జరిగే పరీక్షల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్ష పత్రాలు భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్స్ వద్ద, ప్రశ్నపత్రాలు తీసుకుని వెళ్లే సమయంలో బందోబస్తు, పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు.
News March 14, 2026
మరి కాసేపట్లో గుత్తికొట ఉత్సవాలు ప్రారంభం

గుత్తి ఫుట్‌బాల్ క్రీడా మైదానంలో నేటి నుంచి ప్రారంభం కానున్న గుత్తి కోట ఉత్సవాలు మరి కొద్ది సేపట్లో ప్రారంభం కానున్నాయి. ఫుట్‌బాల్ క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన స్టేజీ వద్దకు ప్రజలు ఒక్కొక్కరుగా వస్తున్నారు. స్టేజ్ వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. కోట ఉత్సవాలు 2 రోజుల పాటు జరగనున్నాయి.


